హోమ్ / వంటకాలు / ఆలూ బ్రెడ్ టోస్ట్

Photo of ALOO BREAD TOAST by Ram Ram at BetterButter
499
2
0.0(0)
0

ఆలూ బ్రెడ్ టోస్ట్

May-27-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బ్రెడ్ టోస్ట్ రెసిపీ గురించి

సులభంగా మరియు నూనె తక్కువగా వాడి చేసుకునే వంటకం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంపలు 2చిన్నవి
  2. బఠానిలు కొద్దిగా
  3. బ్రెడ్ 4
  4. నీళ్లు కొద్దిగా
  5. దానియా పొడి 1స్పూన్
  6. కారం 1స్పూన్
  7. పసుపు 1/4స్పూన్
  8. ఉప్పు సరిపడా
  9. ఆవాలు 1/2స్పూన్
  10. జీలకర్ర 1/2స్పూన్
  11. కరివేపాకు కొద్దిగా
  12. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ని ఉడికించుకుని పొట్టు తీసి చిడుముకోవాలి... బఠానిలను ఉడకపెట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి..
  2. వేరే పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి..
  3. దానిలోని కారం పసుపు దానియపొడి వేసుకోవాలి..
  4. అంత కలిపి.. బంగాళదుంప బఠానిలను వేసి బాగా కలుపుకోవాలి..
  5. దీనిలో ఉప్పు నిమ్మరసం పిండి మళ్ళీ బాగా కలిపి 2 నిమిషాలు వేగనివ్వాలి...
  6. అంత బాగా కలుపుకోవాలి...
  7. తర్వాత బ్రెడ్ ని సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి
  8. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని బ్రెడ్ ని ముంచాలి...
  9. బ్రెడ్ ని వెంటనే ముంచి తీసేసి నీళ్ళు పిండుకోవాలి...
  10. పిండిని బ్రెడ్ మధ్యలో ఆలూ మిశ్రమం పెట్టుకోవాలి
  11. మడత పెట్టుకోవాలి..
  12. ఇలా అన్ని చేసుకుని.. పాన్ ఫ్రై చేసుకోవాలి
  13. అన్ని ఇలా కాల్చుకోవాలి 2 వైపులా నూనె వేసి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర