టమాట బజ్జి | Tomato bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato bajji recipe in Telugu,టమాట బజ్జి, Sree Vaishnavi
టమాట బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

టమాట బజ్జి వంటకం

టమాట బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato bajji Recipe in Telugu )

  • గుండ్రటి టమాటాలు 3-6
  • సెనగపిండి 1 కప్
  • బియ్యంపిండి 5-6 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • వాము 1/2 చెంచా
  • మరమరాలు 1 కప్
  • ఉల్లిపాయ 1
  • కొత్తిమీర 1 చెంచా
  • చాట్ మసాలా 1 చెంచా
  • నిమ్మరసం 1 చెంచా
  • వేయించిన పల్లీలు 3 చెంచాలు
  • వేయించిన సెనగపప్పు 2-3 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడా

టమాట బజ్జి | How to make Tomato bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు ,కారం ,వాము నీళ్లు పోసుకొని బజ్జి పిండి ల చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు టమాట ని బాగా కడిగి తుడుచుకోవాలి
  3. ఇప్పుడు కడాయి లో నూనె కాచుకోవాలి
  4. ఆ బజ్జి పిండిలో టమాటలని ముంచి నూనె లో వేసి వేయించాలి
  5. అవి సగం వేగాక తీసి మళ్ళి పిండిలో ముంచి నూనె లో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. అవి చాలారిన తరువాత మధ్యలోకి కోసుకోవాలి
  7. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టమాట రసం గింజలు (మధ్యలో భాగం )వేసుకోవాలి
  8. అందులో తరిగిన ఉల్లిపాయ ,వేసుకొని బాగా కలిపి ఉప్పు, కారం కొత్తిమీర చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  9. కలుపుకున్న తరువాత వేయించిన పల్లీలు ,సెనగపప్పు మరమరాలు వేసి మరోసారి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  10. ఇప్పుడు దానిని వేయించిన టమాటాలో కురుకోవాలి
  11. అంతే పైన కొంచెం కొత్తిమీర జల్లుకోవడమే

Reviews for Tomato bajji Recipe in Telugu (0)