తందూరీ మోమోస్ | Tandoori momos Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tandoori momos recipe in Telugu,తందూరీ మోమోస్, Sree Vaishnavi
తందూరీ మోమోస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

తందూరీ మోమోస్ వంటకం

తందూరీ మోమోస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tandoori momos Recipe in Telugu )

  • మైదా 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • పెరుగు 1/2 కప్
  • గరం మసాలా 1/2 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కొత్తిమీర 2 చెంచాలు
  • పుదీనా 2 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడా
  • అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  • సెనగపిండి 2 చెంచాలు
  • ఉల్లిపాయ 1
  • బంగాళదుంప 1
  • టోఫు 1 కప్
  • కాప్సికం 1
  • బఠాణి 1/2 కప్
  • క్యారెట్ 1
  • పనీర్ 1 కప్
  • చాట్ మసాలా 1/2 చెంచా

తందూరీ మోమోస్ | How to make Tandoori momos Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో పెరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలి
  2. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లులి పేస్ట్ ,సెనగపిండి 2 చెంచాలు,పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో మరుగుతున్న వేడి నూనె కూడా వేసుకోవాలి
  4. ఇప్పుడు టోఫు క్యారెట్ కాప్సికం ఉల్లిపాయ తరుగుకోవాలి
  5. వాటిని మసాలా పెరుగు మిశ్రమం లో 30 నిముషాలు మ్యారినేట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి ,ఉప్పు, నీళ్లు, వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  7. దానిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  8. ఈలోపు మరో గిన్నె తీసుకొని అందులో తురిమిన పనీర్ ,బఠాణి ,క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా,గరం మసాలా, వేసి బాగా కాపుకోవాలి
  9. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం లో చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న పూరి ల చేసుకొని మధ్యలో చేసుకున్న కూరను కూరుకుని
  10. దానిని మోమోస్ ల చుట్టుకోవాలి
  11. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసుకొని కాచుకోవాలి
  12. నూనె వేడి అయ్యిన తరువాత అందులో మోమోస్ వేసి వేయించుకోవాలి
  13. అవి వేగిన తరువాత వాటిని మ్యారినేట్ చేసిన వాటిలో వేసి మరో 10 నిమిషాలు ఉంచుకోవాలి
  14. ఇప్పుడు తందూరీ స్టిక్ తీసుకొని ఒక ఒక కూరగాయ ముక్క గుచ్చి మోమోస్ కూడా గుచ్చుకోవాలి
  15. ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని బాగా కాగాక వీటిని నూనె వేసి అన్ని వైపుల కాల్చుకోవాలి

నా చిట్కా:

మోమోస్ మీకు ఇష్టమైన ఆకారం లో చేసుకోవచ్చు

Reviews for Tandoori momos Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo