హోమ్ / వంటకాలు / హెల్తీ ఎయిర్ఫ్రయర్ క్రాకర్స్

Photo of Healthy Airfryer Crackers by Swetha B at BetterButter
664
1
0.0(0)
0

హెల్తీ ఎయిర్ఫ్రయర్ క్రాకర్స్

Jun-01-2018
Swetha B
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హెల్తీ ఎయిర్ఫ్రయర్ క్రాకర్స్ రెసిపీ గురించి

ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్నీ ఆరోగ్య సమస్యలే ఉంటున్నాయి ముఖ్యంగా ఈ వంటకం చిరుతిండి గానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓట్స్, నువ్వులు మరియు చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • బేకింగ్
  • చిరు తిండి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి - 1 కప్పు
  2. జొన్న పిండి - 1 కప్పు
  3. ఓట్స్ పొడి - 1 కప్పు
  4. కారం - 2 చెంచాలు
  5. నువ్వులు - 1/2 కప్పు
  6. చియా సీడ్స్ - 1 చెంచా
  7. కసూరి మేతి - చిటికెడు
  8. నూనె - 2 చెంచాలు
  9. ఉప్పు - తగినంత
  10. వేడినీళ్లు - తగినంత

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఓట్స్ వేయించాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  2. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఓట్స్ పొడి, గోధుమపిండి, జొన్న పిండి, కసూరి మేతి, కారం ఉప్పు, నూనె, నువ్వులు, చియా సీడ్స్ మరియు తగినంత వేడి నీరు కొద్ది కొద్దిగా వేస్తూ గట్టిగా పిండి కలుపుకోవాలి.
  3. తడి గుడ్డను కప్పి 30 నిమిషాలు పక్కన ఉంచాలి.
  4. 30 నిమిషాలు తరువాత ఆ ముద్దని కాస్త మందంగా చపాతీల్లా వత్తుకొని ఏదైనా సీసా మూతతో గుండ్రంగా లేదా నచ్చిన ఆకారంలో కట్ చేసి ఉంచుకోవాలి.
  5. ఎయిర్ ఫ్రయర్ 5 నిమిషాలు 200 డిగ్రీలు పెట్టి వేడెక్కించాలి.
  6. ఆ తరువాత బాస్కెట్ లో ఆ కట్ చేసిన వాటిని వేసి 180 డిగ్రీల ఉష్ణోగ్రత లో 10 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి.
  7. అంతే ఎంతో రుచికరమైన కరకరలాడే క్రాకర్స్ సిద్ధం. వీటిని గాలి చొరవని డబ్బాలో పెట్టి నిల్వ ఉంచొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర