క్రౌన్ పిజ్జా | Crown pizza Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Crown pizza recipe in Telugu,క్రౌన్ పిజ్జా, Sree Vaishnavi
క్రౌన్ పిజ్జాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    2

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

క్రౌన్ పిజ్జా వంటకం

క్రౌన్ పిజ్జా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crown pizza Recipe in Telugu )

  • ఈస్ట్ 1 చెంచా
  • మైదా పిండి 2 కప్పులు
  • నీళ్లు తగినంత
  • ఉప్పు తగినంత
  • ఛీజ్ 1 కప్పు
  • ఉల్లిపాయ చక్రలుగా తరిగినది 1
  • కాప్సికం చక్రలుగా తరిగినది 1
  • పచ్చిమిర్చి 1
  • ఓలివ్స్ 3-6
  • జల్పనోస్ 3-5
  • పంచదారా 1 చెంచా
  • స్వీట్ కార్న్ 1 కప్
  • బంగాళదుంప 2-3 ఉడికించినది
  • కొత్తిమీర 2-3 చెంచాలు తరిగినది
  • మిశ్రమ మూలికల పొడి 2-3 చెంచాలు
  • రెడ్ చిల్లీ ఫ్లక్స్ 1-2 చెంచాలు
  • బేసిల్ 1 చెంచా
  • ఒరిగానో 1 చెంచా
  • పిజ్జా సాస్ 2-3 చెంచాలు
  • టమాట చక్రలుగా తరిగినది 1-2
  • బట్టర్ 2 చెంచాలు
  • మొక్కజొన్న పిండి 3-4 చెంచాలు

క్రౌన్ పిజ్జా | How to make Crown pizza Recipe in Telugu

  1. ముందుగా ఈ క్రింది కావలిసినవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక గాజు గిన్నెలో మైదా పిండి ఈస్ట్ ఉప్పు పంచదార బట్టర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. కలిసిన తరువాత నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి దాని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఉడికించిన ఆలూ వేసి బాగా మెదపాలి
  5. అందులో కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు రెడ్ చిల్లి ఫ్లక్స్ మిశ్రమ మూలికల పొడి ఒరిగానో బేసిల్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  6. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వాటి మధ్యలో చీజ్ ని కురుకోవాలి
  7. ఇప్పుడు మైదా పిండిని తీసుకొని కొంచెం లావుగా చపాతీ ల వత్తుకోవాలి దానిని ఫోర్క్ తో పొడవాలి
  8. ఇప్పుడు ఆ ఉండలను చివర్లో పెట్టాలి
  9. దానిని మూసివేయాలి బయటికి రాకుండా
  10. ఇప్పుడు మధ్యలో పిజ్జా సాస్ వేసి రాసుకోవాలి
  11. దాని మీద చీజ్ వేసి కూరగాయలు వేసుకోవాలి
  12. ఇప్పుడు చివరిన మిశ్రమ మూలికల పొడి రెడ్ చిల్లి ఫ్లక్స్ వేసి 30 నిమిషాలు బేక్ చేసుకోవడమే

Reviews for Crown pizza Recipe in Telugu (0)