అల్లం ఇడ్లీ | Ginger idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ginger idly recipe in Telugu,అల్లం ఇడ్లీ, Sree Vaishnavi
అల్లం ఇడ్లీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

అల్లం ఇడ్లీ వంటకం

అల్లం ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger idly Recipe in Telugu )

  • అల్లం 250 గ్రామ్స్
  • చింతపండు నిమ్మకాయ పరిమాణం
  • నూనె 2-3 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • పంచదార 2 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1/2 చెంచా
  • సెనగపప్పు 1/2 చెంచా
  • పల్లీలు 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 2-3
  • కరివేపాకు 1 రెమ్మ
  • మిగిలిపోయిన మినీ ఇడ్లీ 15
  • నీళ్లు తగినంత

అల్లం ఇడ్లీ | How to make Ginger idly Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి
  2. అది వేగిన తరువాత బాగా కడిగి ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి
  3. అందులో 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  4. అందులో తగినంత ఉప్పు కారం పంచదార వేసుకోవాలి
  5. అందులో కొంచం నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి
  7. అది వేగిన తరువాత పల్లీలు మినపప్పు సెనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి
  8. ఇప్పుడు అందులో చేసుకున్న పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి
  9. ఇలా ఇడ్లిని పక్కన పెట్టుకోవాలి
  10. ఇప్పుడు ఆలా పక్కన పెట్టుకున్న ఇడ్లి ని వేగుతున్న దానిలో వేసుకోవాలి
  11. అవి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే

Reviews for Ginger idly Recipe in Telugu (0)