మసాలా వడ | Masala vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala vada recipe in Telugu,మసాలా వడ, Sree Vaishnavi
మసాలా వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala vada Recipe in Telugu )

  • 200 గ్రాములు పచ్చిశనగ పప్పు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 చిన్న ఉల్లిపాయ
  • ¼ కొత్తిమీర తరుగు
  • ఉప్పు
  • జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 4
  • నూనె వేయించడానికి సరిపడా
  • సెనగపిండి 1/2 కప్

మసాలా వడ | How to make Masala vada Recipe in Telugu

  1. ముందుగా సెనగపప్పును 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన పప్పును మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  4. అందులో తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేసుకోవాలి
  5. వాటి అన్నిటికి బాగా కలిసేలా కలుపుకోవాలి
  6. అది వడ ల చేతికి అవ్వకపోతే కొంచెం సెనగపిండి వేసుకోవచ్చు
  7. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  8. కొద్దిగా నూనెను అరచేతికి రాసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద నిమ్మకాయ పరిమాణంలో పిండిని తీసుకొని గుండ్రంగా వడలా తట్టి నూనెలో జారవిడవాలి.
  9. మరీ పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలు చక్కని బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి.
  10. వేయించిన వడలను పేపర్ టవల్ మీదకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇలాగే పిండి అంతా అయిపోయే వరకు వేయించుకోవాలి.

నా చిట్కా:

అది వడ ల చేతికి అవ్వకపోతే కొంచెం సెనగపిండి వేసుకోవచ్చు

Reviews for Masala vada Recipe in Telugu (0)