హోమ్ / వంటకాలు / కరకర మసాలా శెనగలు

Photo of Crispy Roasted Masala Chick Peas by Suma Malini at BetterButter
1215
0
0.0(0)
0

కరకర మసాలా శెనగలు

Jun-02-2018
Suma Malini
360 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరకర మసాలా శెనగలు రెసిపీ గురించి

శెనగలు మంచి మాంసకృత్తులు, పీచుపదార్ధాలు గల పౌష్టికాహారం. అందరికీ అందుబాటు ధరలో దొరికే ఆరోగ్యకరమైన, రుచి కరమైన పదార్థం. బయట దొరికే పాలిష్ పప్పులు, పిండి కన్నా ఇవి ఎంతో శ్రేష్టం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • బేకింగ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాబోలి షశెనగలు 1 కప్పు
  2. ధనియాలు 1 చెంచా
  3. పసుపు 1/2 చెంచా
  4. అల్లం 1/2 అంగుళం
  5. వెల్లుల్లి 5 రెబ్బలు
  6. పసుపు ఒక చిటికెడు
  7. ఉల్లిపాయ ముక్కలు లేదా కాడలు 2 చెంచాలు
  8. టమోటో సగం

సూచనలు

  1. కాబూలి శెనగలు సరిపడా నీళ్లు పోసి రాత్రంతా లేదా రెండింతలు అయ్యే వరకు నానబెట్టాలి.
  2. టమొటో, ధనియాలు, పసుపు, ఉల్లి కాడలు, అల్లం, వెల్లుల్లి,పండు మిర్చి పేస్ట్ వేసి మెత్తగా మసాలా ముద్దని రుబ్బుకోవాలి.
  3. రుబ్బిన మసాలాని శెనిగలకు పట్టించాలి.
  4. వీటిని ఆవిరి పట్టాలి. వీటికి వెన్న పూస పట్టించి 10 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి.
  5. ఫ్రిజ్లో పెట్టిన శెనగలని ఎయిర్ ఫ్రైర్ లో 20 నిమిషాలు పాటు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో , 10 నిమిషాలు పాటు 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పడేంతవరకు వేయించాలి.
  6. ఎయిర్ ఫైయర్ కట్టేసి చల్లారాక కర కర లాడే శెనగలు రడీ‌.
  7. వీటిని ఇలాగే తినొచ్చు లేదా ఉల్లి తరుగు,చాట్ మసాలా చల్లుకొని వడ్డించాలి.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర