ఉగ్గాని మరియు ఉల్లి పకోడి | Uggani with onion pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Uggani with onion pakodi recipe in Telugu,ఉగ్గాని మరియు ఉల్లి పకోడి, Sree Vaishnavi
ఉగ్గాని మరియు ఉల్లి పకోడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఉగ్గాని మరియు ఉల్లి పకోడి వంటకం

ఉగ్గాని మరియు ఉల్లి పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Uggani with onion pakodi Recipe in Telugu )

  • నూనె వేయించడానికి సరిపడా
  • మరమరాలు 2 కప్పులు
  • ఉల్లిపాయ 1
  • టమాట 1
  • కొత్తిమీర 2 చెంచాలు
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • పసుపు చిటికెడు
  • పల్లీలు 2-3 చెంచాలు
  • నిమ్మరసం 1 చెంచా
  • సెనగపిండి 1 కప్
  • బియ్యంపిండి 3 చెంచాలు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ 2-3
  • దంచిన ధనియాలు 2 చెంచాలు

ఉగ్గాని మరియు ఉల్లి పకోడి | How to make Uggani with onion pakodi Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ,ఉప్పు ,కారం, దంచిన ధనియాలు, వేసి బాగా కలపాలి
  2. అందులో కొంచెం తడి వచ్చాక తగినంత సెనగపిండి, బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  4. నూనె వేడి అయ్యిన తరువాత పకోడీల నూనె లో వేసి వేయించుకోవాలి
  5. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు పల్లీలు ,నిమ్మరసం వేసి వేయించాలి
  7. వేగిన తరువాత కరివేపాకు ,ఉల్లిపాయ, టమాట వేసి వేయించాలి
  8. అవి వేగిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, వేసి వేగిన తరువాత అందులో నానబెట్టిన మరమరాలు వేసి రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

మరమరాలు ని కొంచెం సేపు నానబెట్టుకోవాలి

Reviews for Uggani with onion pakodi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo