పెసర పుణుగులు | PESARA PUNUGULU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  4th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PESARA PUNUGULU recipe in Telugu,పెసర పుణుగులు, Ram Ram
పెసర పుణుగులుby Ram Ram
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పెసర పుణుగులు వంటకం

పెసర పుణుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PESARA PUNUGULU Recipe in Telugu )

  • పెసరపప్పు 1/4 కేజీ
  • ఇడ్లీ పిండి 1/4కప్పు(ఆప్షనల్)
  • పచ్చిమిర్చి 5
  • వెల్లులి రెబ్బలు 10
  • అల్లం చిన్నముక్క
  • జీలకర్ర 2స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె వేయించడానికి saripada

పెసర పుణుగులు | How to make PESARA PUNUGULU Recipe in Telugu

  1. పెసర పప్పుని ఒక 1 రోజు ముందు బాగా శుభ్రం చేసి సరిపడినన్ని నీళ్లు పోసి నానపెట్టుకోవాలి.
  2. నానిన పప్పును గ్రైండర్ లో వేసి ,పచ్చి మిర్చి ,2స్పూన్ల జీలకర్ర, వెల్లులి రెబ్బలు 10 ,అల్లం ముక్క ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో రుబ్బుకున్న పిండిని తీసుకుని 1/4కప్పు ఇడ్లీ పిండి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  4. ఒక కడై లో వేయించడానికి నూనె పెట్టుకుని వేడి చేసుకోండి. నూనె వేడి అయ్యాక ఒక్కో చెంచాడు పిండిని గుండ్రంగా పోనుగులు వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకొని తీసుకోండి.
  5. ఎంతో రుచిగా ఉండే పునుగులు రెడీ. చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

పొట్టుతో ఉన్న పప్పు వేసుకుంటే పోనుగులు గుల్లగా వస్తాయి మరియు రుచిని రెట్టింపు చేయటానికి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చును.

Reviews for PESARA PUNUGULU Recipe in Telugu (0)