హోమ్ / వంటకాలు / కప్పుతో పాలకూర

Photo of Spinach Cups by Suma Malini at BetterButter
435
1
0.0(0)
0

కప్పుతో పాలకూర

Jun-05-2018
Suma Malini
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కప్పుతో పాలకూర రెసిపీ గురించి

పాలకూర,సజ్జలు, గోధుమ పిండిలో ఉండే సహజమైన ఖనిజ,లవణ పదార్థాలు మనలో ఐరన్, హిమొగ్లోబిన్ పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఇందులో వాడిన నూనె గింజలు నువ్వులు, బాదంపప్పు,అక్రూట్ కాల్షియం కలిగి ఉండం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాలకూర 4 కట్టలు
  2. గోధుమ పిండి 1 కప్పు
  3. సజ్జ పిండి 4 చెంచాలు
  4. ధనియాలు 1 చెంచా
  5. పండు మిర్చి పేస్ట్ 1 చెంచా (కారం)
  6. ఇంగువ చిటికెడు
  7. నువ్వులు 4 చెంచాలు
  8. అక్యూట్ 6 గింజలు
  9. బాదం 15 గింజలు
  10. అవిసె గింజలు 4 చెంచాలు
  11. వెన్న పూస 30 గ్రా
  12. పెరుగు 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి కాడలుతో సహా సన్నగా తరగాలి.
  2. దీనిని కొంచెం పెరుగు వేసి ఉడికించాలి.
  3. ధనియాలు, ఇంగువ, పండు మిర్చి, ముద్దగా రుబ్బుకోవాలి ‌
  4. ఈ ముద్దను పాలకూరలో వేసి ఉడికించి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి.
  5. బాదం,అక్రూట్, అవిసె గింజలును పొడి చేసుకోవాలి.
  6. పుల్లని పెరుగులో పాలకూరముద్ద, గింజలు పొడి వేసి బాగా కలపాలి. కావాలి అనుకుంటే కారంపొడి మరికొంత కలుపుకోవాలి. ఉప్పు అవసరం అస్సలు ఉండదు.
  7. గొధుమ,సజ్జ పిండి కలుపుకోవాలి.
  8. ఆరు గంటలు ఊరనివ్వాలి
  9. ఊరిన పిండిలో వెన్న పూస కలపాలి.
  10. హాట్ ఎయిర్ ఫైయర్ ని 10 నిమిషాలు 200 దగ్గర వేడిచేసి మిశ్రమాన్ని సిలికాన్ కప్పు లో కింద. నువ్వులు వేసి నింపి పైన కూడా నువ్వులు చల్లాలి.
  11. ఈ కప్పులను మొదటి 10 నిమిషాలు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో తర్వాత 10 నిమిషాలు 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చుకోవాలి.
  12. కాలిన మఫిన్సను తిరగేసి మరో 10 నిమిషాలు 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చుకోవాలి.
  13. హాట్ ఎయిర్ ఫైయర్ ఆప్ చేసి చల్లారనిచ్చి ఆవ పెరుగు పచ్చడి తో వడ్డీంచాలి‌. (పచ్చి ఆవాలు ముద్ద గా నూరి పుల్లని పెరుగులో కలిపి, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర మీగడ తో. వేయించి కచ్చాపచ్చాగ దంచి ఆవ పెరుగుకి కలపాలి‌.)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర