హోమ్ / వంటకాలు / తోటకూర పునుగులు.

Photo of Thotakura punugulu. by Lakshmi Leelavathi at BetterButter
1162
1
0.0(0)
0

తోటకూర పునుగులు.

Jun-07-2018
Lakshmi Leelavathi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పునుగులు. రెసిపీ గురించి

తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ప్రోటీన్లు , సోడియం ,మినరల్స్ మరియు విటమిన్ A వంటివి మెండుగా లభిస్తాయి. ఈ ఆకుని ఉపయోగించి పాలకూర లాగ ఎన్నో రకాలు వండుకోవచ్చు.తోటకూర లో , పాలకూర మరియు బచ్చలి తో పోలిస్తే నీటి శాతం తక్కువగా ఉంటుంది కిబట్టి వడలు, పునుగులు, బజ్జీలు లాంటివి చేసుకోవటం తేలికవవుతుంది . తోటకూర పునుగులు తక్కువ సమయంలో మిగిలిన ఇడ్లి పిండి వాడి చేసుకునే రుచికరమైన వంట. సాయంత్రం తీసుకునే అల్పాహారిణికి ఇది ఎంతో బాగుంటుంది . కేవలం ఒక కప్పు ఛాయ్ ఉంటే చాలు ఆహా ఏమి రుచి అని అనక మానరు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఇడ్లిపిండి 1 కప్పు
  2. బియ్యంపిండి 1/4 కప్పు
  3. తోటకూర 1/4 కట్ట
  4. పచ్చిమిర్చి 4
  5. కొత్తిమీర కొంచెం
  6. ఉల్లిపాయలు 3(పెద్దవి)
  7. ఉప్పు తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. కరివేపాకు 2రెమ్మలు

సూచనలు

  1. ముందుగా ఒక కప్పు ఇడ్లి పిండిని తీసుకోవాలి. తర్వాత దానిలో 1/4 కప్పు బియ్యంపిండి కలుపుకోవాలి.
  2. ఇందులోతరిగిన తోటకూర వేసి కలుపుకోవాలి
  3. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు,కలుపుకోవాలి.
  4. అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడై పెట్టి వేడి అయ్యిన తర్వాత వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి.
  5. నూనె కాగిన తర్వాత పిండిని కొంచెం కొంచెం గా చేతిలో తీసుకొని నూనెలో వేసుకొని బంగారు రంగు వచ్చేదాకా వేయించుకొని బయటకు తీసేయాలి.
  6. అంతే ఎంతో రుచిగా ఉండే తోటకూర పునుగులు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర