పనస తొనల ఫ్రిటర్స్ | Jack Fruit Fritters Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jack Fruit Fritters recipe in Telugu,పనస తొనల ఫ్రిటర్స్, Tejaswi Yalamanchi
పనస తొనల ఫ్రిటర్స్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పనస తొనల ఫ్రిటర్స్ వంటకం

పనస తొనల ఫ్రిటర్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jack Fruit Fritters Recipe in Telugu )

  • పనస తొనలు 4 గింజలు తీసేయండి
  • మైదా 6 చెంచాలు
  • పంచదార 4 చెంచాలు
  • సోడా ఉప్పు 1/4 చెంచా
  • యలుకాయల పొడి 1/4 చెంచా
  • రెడ్ ఫుడ్ రంగు ఒక పించ్
  • నీరు తగినంత
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

పనస తొనల ఫ్రిటర్స్ | How to make Jack Fruit Fritters Recipe in Telugu

  1. ముందుగా పనస తొనలు తీసుకొని గింజలు తీసేయండి
  2. ఒక గిన్నె లో పంచదార తీసుకోండి
  3. కాస్త నీరు పోసుకోండి
  4. పంచదార కరిగే దాకా కలపండి
  5. ఇప్పుడు దానిలో మైదా కలుపుకోవాలి
  6. మిశ్రమం మెత్తగా చేస్కోండి కానీ కాస్త గట్టిగా కలుపుకోవాలి
  7. కాస్త సోడా ఉప్పు వేయండి
  8. కాస్త రెడ్ ఫుడ్ రంగు వేయండి
  9. కాస్త యలుకాయల పొడి వేయండి
  10. బాగా కలుపుకోండి. మైదా మిశ్రమం తయారు.
  11. ఒక గిన్నెలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టండి.అది కాగాక
  12. పనస ముక్కలని మైదా మిశ్రమంలో ముంచుకోండి
  13. కాగిన నూనె లో వేసుకోండి
  14. బాగా బంగారు రంగు వొచ్చే దాకా వేయించుకోండి
  15. అంతే పనస తొనల ఫ్రిటర్స్ తయారు

Reviews for Jack Fruit Fritters Recipe in Telugu (0)