హోమ్ / వంటకాలు / దాల్ రైస్ చిస్ బాల్స్

Photo of Dhal rice cheese balls by Deepika Goud at BetterButter
556
0
0.0(0)
0

దాల్ రైస్ చిస్ బాల్స్

Jun-11-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ రైస్ చిస్ బాల్స్ రెసిపీ గురించి

అన్నం పప్పు తో చేసుకొనే రుచికరమైన మరియు పౌష్టికమైన అల్పాహారం. చీజ్ ఉండడం వలన పిల్లలు ఎంతో ఇష్టం గా తింటారు. పప్పు లో ఉన్న ప్రోటీన్లు, అన్నం లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అలాగే చీజ్ లో ఉన్న కాల్షియమ్ అన్ని ఒకే డిష్ లో శరీరానికి అందుతాయి . మిగిలిన అన్నం పప్పు ఉపాయగించి కూడా చేసుకోవచ్చును .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నం 1 కప్పు
  2. ఉడికించిపెట్టుకున్న కందిపప్పు ‌1కప్పు
  3. తురిమి పెట్టుకున్న చిస్
  4. తరిగిన అల్లం,వెళ్లి ఉల్లి ముక్కలు 2 చెంచాలు
  5. ఆమ్ చుర్ 1/2 టిస్పూన్
  6. ధనియాపొడి 1/2టీస్పూన్
  7. కారం కొద్దిగా
  8. ఉప్పు రుచిని బట్టి
  9. పసుపు చిటికెడు
  10. ఉల్లిపాయ1
  11. క్యారెట్ తురుము 1/2కప్పు
  12. టమాటొ 1
  13. పచ్చిమిర్చి 3
  14. జిలకర్ర1/2 చెంచా
  15. కొత్తిమీరు కొద్దిగా
  16. పూదిన కొద్దిగా
  17. గుడ్డు 1
  18. కార్న్ ఫ్లొర్ 1టేబుల్ స్పూన్
  19. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా అన్నం పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి లేదా మిగిలిన అన్నం కుడా వాడుకొవచ్చు.
  2. క్యారెట్ మరియు చీజ్ ని తురిమి పెట్టుకొవాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చీ , టమాటొ , అల్లం వెళ్లిఉల్లి అన్ని సన్నగా కట్ చెసి పెట్టుకొవాలి.
  4. ఇప్పుడు.స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొయాలి అది వేడి అయ్యాక జిలకర్ర , తరిగి పెట్టిన కూర ముక్కలు ఒక దాని తరువాత ఒకటి వేస్తూ పచ్చి వాసన .పొయె వరకు ప్రై చెయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు , చిటికెడు పసుపు వేయండి . తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి తరువాత ఉడికించిన అన్నం కూడా వేసుకొని కలపాలి . ఇప్పుడు దనియాపొడి, ఆమ్ చుర్ పొడి , సరిపడ కారం వేసి కలపాలి. ఆఖరిని కొత్తిమీరు , పూదిన వెసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు స్టవ్త కట్టేసి మగ్గించుకున్న మిశ్రమాన్ని ఒక.ఫ్లెట్ లొకి తిసుకొని 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి .
  6. ఆ లొపు గుడ్డు ని ఒక గిన్నెలొ తిసుకొని బాగా బిట్ చెయాలి. ఇంకొక ఫ్లెట్ లో కార్న్ ఫ్లొర్ వేసి రెడీ గ పెట్టుకోండి .
  7. ఇప్పుడు ఫ్రిజ్ లొ పెట్టిన అన్నo మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ముద్దలు తిసుకొని దాని మద్యలొ చిస్ ముక్కను పెట్టి ఉండలు చుట్టుకొవాలి. ఆ ఉండలని ముందు కార్న్ ఫ్లొర్ లొ దొర్లించి తరువాత ఎగ్ లొ ముంచాలి ఇలా అన్ని చెసుకొవాలి .
  8. తరువాత స్టౌ వేలిగించి కడాయి పెట్టి డిప్రై కి నూనె పొయాలి వేడి అయ్యాక ముందుగా రడి చెసుకున్న ఉండలు వేసి బంగారు రంగు వచ్చె.వరకు ఫ్రై చేసుకొని తరువాత ఫ్లెట్ లొకి తిసుకొవాలి .
  9. రుచితో పాటు పౌష్టికరంగా ఉండే అన్నం పప్పు చీజ్ బాల్స్ రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర