పెసర పునుగులు | Moong dal pakoda Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moong dal pakoda recipe in Telugu,పెసర పునుగులు, Sree Vaishnavi
పెసర పునుగులుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పెసర పునుగులు వంటకం

పెసర పునుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong dal pakoda Recipe in Telugu )

  • పొట్టు పెసర పప్పు - 500 గ్రా
  • పచ్చి మిర్చి - 50 గ్రా
  • అల్లం - చిన్న ముక్క
  • జీలకర్ర - 1 చెంచా
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె వేయించటానికి సరిపడా
  • ఉల్లిపాయ 1 ముక్కలుగా తరిగినవి
  • పెరుగు 2 చెంచాలు
  • టమాట కెచప్ 1 చెంచా
  • కొత్తిమీర 2 చెంచాలు

పెసర పునుగులు | How to make Moong dal pakoda Recipe in Telugu

  1. పెసర పప్పుని 3 గంటలు పాటు సరిపడినన్ని నీళ్లు పోసి నానపెట్టి, శుభ్రంగా కడిగి, నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. అల్లం, మిర్చి రుబ్బి పిండికి జోడించి, ఉప్పు , జీలకర్ర కూడా వేసి రెండు నిమిషాలు రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్న పిండిని గిన్నిలోకి తీసుకోవాలి.
  4. బాణలిలో నూనె వేడి చేసి, కాగిన తరువాత నిమ్మకాయంత ఉండలు వేసి ఎర్రగా వేయించాలి.
  5. వేయించిన పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి మీద చిలికిన పెరుగు ,టమాట కెచప్ ,కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే పెసర పునుగులు మీ అందరి కోసం , మీరు చేసుకొని ఆనందించండి.

Reviews for Moong dal pakoda Recipe in Telugu (0)