వాం పోడి/ సేవ్ | Plain Sev Recipe in Telugu

ద్వారా Sushma Subramanyam  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Plain Sev recipe in Telugu,వాం పోడి/ సేవ్, Sushma Subramanyam
వాం పోడి/ సేవ్by Sushma Subramanyam
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వాం పోడి/ సేవ్ వంటకం

వాం పోడి/ సేవ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Plain Sev Recipe in Telugu )

  • శనగ పిండి- 1 కప్పు
  • బియ్యం పిండి - 1/2 కప్పు కు కొంచం తక్కువ
  • వాము- 1/4 చంచాడు
  • ఉప్పు- తగినంత
  • వేడి నూనె- 1 చంచాడు
  • వేయించడానికి సరిపడా నూనె

వాం పోడి/ సేవ్ | How to make Plain Sev Recipe in Telugu

  1. చక్కిలాల పీటలోని సన్నని సందులు ఉన్న అచ్చు కానీ సేమియా/ ఇడియాప్పం పీట కానీ దగ్గరగా పెట్టుకోవాలి
  2. శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, నూరిన వాము అన్నీ కలిపి జల్లి పట్టుకోవాలి
  3. ఒక మూకుడులొ నూనె వేడికి పెట్టి 1-2 చంచాలు వేడి నూనెని జల్లి పట్టుకుని పెట్టిన శనగపిండి లో వేసి ఒక చంచా తీసుకుని కలుపుకోవాలి
  4. తర్వాత చాలా కొంచెం(తక్కువ) నీళ్ళు వేసి ముద్ద లా తయారు చేసుకోవాలి
  5. పిండి ముద్దని చక్కిలాల పీట కానీ ఇడియాప్పం పీటలో కానీ నింపి వేడి నూనె లోకి వత్తుకోవాలి
  6. వేడి నూనెలో వత్తుకుని తక్కువ మంట (సన్నని సెగ) మీద వేయించుకోవాలి
  7. కొంచెం చల్ల పడ్డాక వేళ్ళతో నలిపితే సేవ్ తయారయినట్టు.
  8. ఇలా తయారయిన వాం పొడి/సేవ్ ను అలాగే తినవచ్చు లేదా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి తో తినవచ్చు.

Reviews for Plain Sev Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo