దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి | Yellow cucumber pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yellow cucumber pickle recipe in Telugu,దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి, Sree Vaishnavi
దోసకాయ పచ్చి ముక్కల పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

1

దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి వంటకం

దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow cucumber pickle Recipe in Telugu )

  • పచ్చ దోసకాయ పెద్దది- ఒకటి
  • కొత్తిమీర తరుగు-1 కప్పు
  • పచ్చిమిర్చి- 8
  • ఉప్పు-రుచికి సరిపడా
  • చింతపండు-కొద్దిగా
  • నూనె- 1 టేబుల్‌స్పూన్
  • ఆవాలు -1 టీస్పూన్‌
  • మినప పప్పు -1 టీస్పూన్‌
  • ఎండుమిర్చి- 1
  • ఇంగువ- 1/8 టీస్పూన్
  • పసుపు 1/4 చెంచా
  • కరివేపాకు ఒక రెమ్మ

దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి | How to make Yellow cucumber pickle Recipe in Telugu

  1. దోసకాయ తొక్కు తీసి మధ్యకు కోసి లోపలి గింజలు తీసేసి చేదు చూశాక చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  2. బ్లెండర్‌ జార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి
  3. తరువాత కొత్తిమీర తరుగు వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి
  4. అవసరమనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు.
  5. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి.
  6. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు(వాడుతున్నట్లైతే), మినప పప్పు, ఇంగువ ,కరివేపాకు,పసుపు వేసుకోవాలి
  7. పోపు చిటపటమంటున్నప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి
  8. ఈ తాలింపును దోసకాయ ముక్కల మిశ్రమంలో వేసి కలుపుకోండి అంటే ఎంతో సులువుగా మన దోసకాయ పచ్చడి తయారైపోయింది. మీరు చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

మీకు నచ్చితే పోపులో మెంతులు కూడా వేసుకోవచ్చు

Reviews for Yellow cucumber pickle Recipe in Telugu (1)

Revathi Kumari3 months ago

Woww
జవాబు వ్రాయండి