మామిడికాయ ముక్కల పచ్చడి | Mango instant pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango instant pickle recipe in Telugu,మామిడికాయ ముక్కల పచ్చడి, Sree Vaishnavi
మామిడికాయ ముక్కల పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    38

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మామిడికాయ ముక్కల పచ్చడి వంటకం

మామిడికాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango instant pickle Recipe in Telugu )

  • పచ్చిమామిడికాయ 1-2
  • ఉప్పు తగినంత
  • కారం 4-5 టేబుల్ స్పూన్లు
  • మెంతి పొడి 3 చెంచాలు
  • ఆవ పొడి 3 చెంచాలు
  • నూనె 4 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • ఎండుమిరపకాయలు 2-3
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

మామిడికాయ ముక్కల పచ్చడి | How to make Mango instant pickle Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయలు కడిగి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి
  2. రుచికి తగినంత కారం వేసుకోవాలి
  3. అందులో కారానికి తగినంత ఉప్పు వేసుకోవాలి
  4. వాటిని బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఆవాలు ,మెంతులు దోరగా వేయించి పొడి చేసుకొని కలుపుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి బాండీ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ ,ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోండి . అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ .

నా చిట్కా:

మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే కాస్త పంచదార వేసుకోవచ్చు.

Reviews for Mango instant pickle Recipe in Telugu (0)