బంగాళదుంప పులిహోర పోపు | Mashed Potatoes (Andhra Style) Recipe in Telugu

ద్వారా Suma Malini  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mashed Potatoes (Andhra Style) recipe in Telugu,బంగాళదుంప పులిహోర పోపు, Suma Malini
బంగాళదుంప పులిహోర పోపుby Suma Malini
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బంగాళదుంప పులిహోర పోపు వంటకం

బంగాళదుంప పులిహోర పోపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mashed Potatoes (Andhra Style) Recipe in Telugu )

  • బంగాళదుంప 2 పెద్దవి.
  • ఉల్లిపాయ 1 పెద్దది.
  • అల్లం అంగుళం ముక్క
  • పచ్చి మిర్చి 1
  • మినప్పప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • పసుపు చిటికెడు
  • కరివేపాకు 6 రేకులు
  • నువ్వుల నూనె లేదా ఆలీవ్ నూనె 2 చెంచాలు

బంగాళదుంప పులిహోర పోపు | How to make Mashed Potatoes (Andhra Style) Recipe in Telugu

  1. బంగాళదుంపలు ఉడికించి ఒలిచి ఉంచుకోవాలి.
  2. బంగాళదుంప ఉడికే లోపు ఉల్లి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు సిద్దం చేసుకొని ఉంచుకోవాలి.
  3. మూకుడులో నూనె పోపు గింజలు వేసి చిన్న సెగపై దోరగా వేయించాలి. ఆలీవ్ నూనె వాడేటప్పుడు ముందు గా పోపు గింజలు పొడి మూకుడులో వేయించి అప్పుడు నూనె వేయాలి.
  4. ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి వేయించి, ఉడికించిన బంగాళదుంప లు మెత్తగా చిదిమి కలియపెట్టండి ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ మాష్డ్ బంగాళాదుంప రెడీ. మీరు చేసుకొని తినటమే ఆలస్యం ..

నా చిట్కా:

నిమ్మరసం పిండి వడ్డిస్తే పులుపు ఇష్టపడే వారికి, ఉప్పు ఇష్టం లేని వారికి బాగుంటుంది.

Reviews for Mashed Potatoes (Andhra Style) Recipe in Telugu (0)