హోమ్ / వంటకాలు / వెన్న వంకాయ

Photo of Butter brinjal curry by Sree Sadhu at BetterButter
626
4
0.0(0)
0

వెన్న వంకాయ

Jun-20-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్న వంకాయ రెసిపీ గురించి

వంకాయ అంటే ఇష్టపడే వారు ఉన్నట్లే అ ఇషిష్టత చూపే వారు కూడా ఉన్నారు . అలాంటి వారు కూడా ఈ వంటకాన్ని ఒక సారి రుచిచూస్తే వారి ఉద్దేశాన్ని మార్చుకుంటారు అంత రుచిగా ఉంటుంది. పేరులో ఉన్నట్టే వెన్నలాగా మృదువుగా , రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. వంకాయ 1/2 కేజీ
  2. పల్లీలు 1 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 3 కప్పులు (సన్నగా తరిగినవి )
  4. కారం 2 1/2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. వెన్న 2 1/2 చెంచాలు
  7. నూనె 2 చెంచాలు
  8. గరం మసాలా 1/2 చెంచా
  9. ఆవాలు 1/2 చెంచా
  10. జీలకర్ర 1/2 చెంచా
  11. ఎండుమిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి
  2. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు ,కారం, గరం మసాలా,పల్లీల పొడి లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని నీళ్లు పోసి కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి
  3. వంకాయలని ముక్కలుగా తరుగుకోవాలి
  4. బాండీ పెట్టుకొని వెన్న మరియు నూనె వేసి కాగనివ్వాలి
  5. అందులో ఉల్లిపాయ మిశ్రమం వేసి నూనె తేలే వరకు వేయించాలి
  6. వేగిన తరువాత అందులో వంకాయలు వేసి మగ్గనివ్వాలి
  7. తరువాత మళ్ళి బాణీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిరపకాయలు పోపు చేసుకొని వంకాయ కూరలో వేసుకోవాలి . వడ్డించే ముందు పై నుండి కాస్త వెన్న వేసుకొని సర్వ్ చేసుకోండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర