హోమ్ / వంటకాలు / చమదుంప ఇగురు

Photo of Colocasia semi gravy by Sukriti Siri at BetterButter
502
0
0.0(0)
0

చమదుంప ఇగురు

Jun-22-2018
Sukriti Siri
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చమదుంప ఇగురు రెసిపీ గురించి

చామదుంపల కూడా అన్నింటి లాగానే ఎన్నో పేర్ల తో పిలువబడుతాయి అందులో కొన్ని ఆర్బి,టారో,ఆర్వీ మొదలగునవి.చామదుంప ఇగురు దక్షిణ భారతీయ సాంప్రదాయిక వంటకాలంలో ఒకటి. చామదుంపలని ఉడికించి,నూనె లో వేయించి,చింతపండు మరియు టమాటా గుజ్జు లో మగ్గించి, జీలకర్ర మెంతుల పొడుల వంటి విభిన్న రుచుల సమ్మేళనమే ఈ ఇగురు. దీని రుచి మీ టేస్ట్ బడ్స్ కి ఒక ఛాలెంజ్ గా నిలుస్తుంది.ఈ ఇగురు చేసుకోవటం సులువైన పని ఇది ఎటువంటి మెయిన్ డిష్ తో అయినను కలిపి వడ్డించుకోవచ్చును.చమదుంప ఇగురు స్పైసీ మరియు పౌష్ఠికరమైన రుచులను ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 6 : చామ దుంపలు పెద్దవి
  2. 1 పెద్ద : ఉల్లిపాయ తరిగినది
  3. 2 : పచ్చి మిరపకాయలు
  4. నిమ్మకాయంత చింతపండు
  5. 1/2 కప్పు : (టమాటా) రామ ములగ పండు గుజ్జు
  6. 1 చిన్న చెంచాడు : పాసుపు
  7. 2 చెంచాలు : ఎర్ర కారం
  8. 1 పెద్ద చెంచాడు : ధనియాల పొడి
  9. 1 చెంచాడు : జీలకర్ర మెంతుల పొడి
  10. 1 చెంచాడు : గరం మసాలా పొడి
  11. 1/2 చెంచాడు : బెల్లం
  12. 2 పెద్ద చెంచాల : కొత్తిమీరు సన్నగా తరిగినది
  13. 3 పెద్ద చెంచాల : పల్లీ నూనె
  14. 1/2 చెంచాడు : ఆవాలు
  15. 1/2 చెంచాడు : జీలకర్ర
  16. 2 : ఎండు మిరపకాయలు ముక్కులగా తుంచినవి
  17. 1 రెమ్మ : కరివేపాకు

సూచనలు

  1. చామదుంపలను సరిపడా నీళ్లు పోసి కుక్కర్ లో 2 కూతలు వచ్చే వరకు ఉడికించి వార్చుకోండి . కాస్త చల్లారిన తర్వాత వాటి తొక్క తీసి ముక్కులుగా తరుగుకోండి .
  2. ఒక మూకుడు పెట్టి వేయించటానికి నూనె పోసి చామదుంప ముక్కలను లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోని పక్కన పెట్టుకోండి .
  3. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మూడు చెంచాల పల్లి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, తుంపిన ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి.
  4. పోపు బాగా వేగిన తరువాత సన్నగా , నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
  5. ఇప్పుడు ఇందులో టమాటో (రామ మూలగా పండు) గుజ్జుని వేసి నూనె చుక్కలు తేలే వరకు మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించండి.
  6. ఇందులో ధనియాల పొడి, జిలకర మెంతుల పొడి, గరం మసాలా పొడి , ఎర్ర కారం, రుచికి అనుగుణంగా ఉప్పు, చిటికెడు చెక్కర లేదా ఒక చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలుపుకొని , తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోండి .
  7. మూత పెట్టి ఒక నిమిషం లేదా పచ్చిదనం పోయే వరకు మరగనివ్వండి.
  8. వేయించిపెట్టుకున్న చామదుంప ముక్కలను వేసి ఒక సారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి . అంత దెగ్గర పడి ముక్క కాస్త మెత్త బడ్డాకా తరిగిన కొత్తిమీరు వేసి గిన్నెలోకి ఓంపుకోండి.
  9. వేడి వేడి అన్నం, చామదుంప ఇగురు ,ముద్దపప్పు, నెయ్యి కలిపి భోంచేస్తే నా సామి రంగా , మీ జీవుడు అదిరిపోడు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర