వాము పులుసు | Ajwain rasam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ajwain rasam recipe in Telugu,వాము పులుసు, Sree Vaishnavi
వాము పులుసుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వాము పులుసు వంటకం

వాము పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ajwain rasam Recipe in Telugu )

  • ఉల్లిపాయ 1
  • వెల్లులిపాయ 6-5
  • ఎండుమిరపకాయలు 3-4
  • వాము 2 చెంచాలు
  • చింతపండు నీళ్లు 2 కప్పులు
  • ఆవాలు 1/2 చెంచా
  • మెంతులు 1/2 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 1-2 చెంచా

వాము పులుసు | How to make Ajwain rasam Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు ,చింతపండు వేసి చింతపండు పులుసు తీసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి కాగనివ్వాలి
  3. కాగిన తరువాత అందులో ఆవాలు ,మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  5. అందులో వాము ,వెల్లులిపాయలు, ఉల్లిపాయ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి
  6. వేగిన తరువాత అందులో కొంచెం ఉప్పు, చింతపండు ,నీళ్లు వేసి మరిగించాలి
  7. ఎంతో ఫుచిగా ఉండే వాము రసం రెడీ . నలత గా ఉన్నప్పుడు చేసుకొని రుచి చూడండి.

Reviews for Ajwain rasam Recipe in Telugu (0)