హోమ్ / వంటకాలు / పండుమిరపకాయ నిలువ పచ్చడి

Photo of Pandumirapakaya Pickle/Red chilli pickle by Tejaswi Yalamanchi at BetterButter
486
0
0.0(0)
0

పండుమిరపకాయ నిలువ పచ్చడి

Jun-25-2018
Tejaswi Yalamanchi
4350 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండుమిరపకాయ నిలువ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చని ఎక్కువగా చలికాలం చివర్లో పట్టుకుంటాను. దీన్ని చాలా రోజులవరకు నిలువ ఉంచుకోవచ్చు. ఈ పచ్చడిని పండుమిరపకాయలతో చేసుకుంటాము

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పండు మిరపకాయలు 500 గ్రాములు
  2. చింతపండు 150 గ్రాములు
  3. ఉప్పు 25 గ్రాములు ,ఒక చెంచా పైన చళ్ళటానికి
  4. పసుపు 1 చెంచా
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 25 గ్రాములు
  6. వేయించిన ఉల్లిపాయ విత్తనాలు పొడి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పండుమిరపకాయలు శుభ్రంగా కడగండి
  2. పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఎండలో ఆరబెట్టండి
  3. నీరు పండుమిరపకాయలకి అసలు ఉండకూడదు పూర్తిగా ఎండిపోవాలి
  4. చింత పండును తీసుకొని దానిలో గింజలు తొక్కలు అని వేరే చేసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  5. పండుమిరపకాయలు ముక్కలుగా చేసుకొండి
  6. మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా చేసుకోండి
  7. అన్ని ఒకేసారి వేసుకోకండి విడతలు విడతలుగా వేసుకుని కచ్చాపచ్చాగా చేసుకోండి
  8. కచ్చపచ్చగా చేసుకున్న పండుమిరపకాయలు ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి
  9. గాలి చేరని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో కింద చింతపండుని వేసుకొని దానిపైన ఉప్పు కలిపిన పండుమిరపకాయలు వేసుకోండి
  10. దానిపైన ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు చల్లండి
  11. గట్టిగా మూత పెట్టి రెండు నుంచి మూడు రోజుల వరకు కదపకుండా పక్కన ఉంచుకోండి
  12. పండుమిరపకాయ లోని తేమ వల్ల చింతపండు మెత్తపడుతుంది
  13. నేను మూడు రోజులు పక్కన పెట్టాను
  14. మూడు రోజుల తర్వాత పండుమిరపకాయలు మాత్రమే విడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పేటండి
  15. చింతపండు గుజ్జును జార్లో వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి
  16. ఈ చేసుకున్న పేస్ట్ని మళ్ళీ పండుమిరపకాయలలో వేసి చక్కగా కలుపుకొండి
  17. ఇప్పుడు వాటిపైన వేయించి పొడి చేసుకున్న ఉల్లిపాయ విత్తనాలు పొడి ఒక చెంచా వెయ్యండి
  18. కొంచెం రుచి చూసి కావాలనుకుంటే కనక ఉప్పు వేసుకోండి
  19. ఇప్పుడు మొత్తంగా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఒక రెండు మూడు సార్లు తిప్పుకొండి
  20. ఇప్పుడు మిశ్రమాన్ని ఒక జార్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు
  21. మీకు కావాల్సిన అప్పుడు అల్లా కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని తినొచ్చు
  22. పండుమిరపకాయ నిలువ పచ్చడి తయారు.మీరు చేసుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర