పండుమిరపకాయ పచ్చడి | Red chilli pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red chilli pickle recipe in Telugu,పండుమిరపకాయ పచ్చడి, Sree Vaishnavi
పండుమిరపకాయ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

0

0

పండుమిరపకాయ పచ్చడి వంటకం

పండుమిరపకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli pickle Recipe in Telugu )

  • పండుమిరపకాయలు1 కెజి
  • చింతపండు పావు కేజీ
  • బెల్లం 100 గ్రామ్
  • మెంతులు 5 స్పూన్స్
  • ఉప్పు పావు కేజీ
  • ఆవాలు 1 స్పూన్
  • జీలకర్ర 1 స్పూన్
  • ఇంగువ 1 స్పూన్
  • నూనె 4 స్పూన్స్

పండుమిరపకాయ పచ్చడి | How to make Red chilli pickle Recipe in Telugu

  1. మెంతులు వేయించుకుని పొడి చేసుకోవాలి
  2. మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఉప్పు, పసుపులతో పాటు వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి(మెత్తగా రుబ్బకూడదు).
  3. ఆ రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు మీద ఉంచి, డబ్బా మూత పెట్టి 2 నుండి 3 రోజుల పాటు నాననివ్వాలి.
  4. పచ్చి మిర్చి గుజ్జులోని తడి వల్ల కింద ఉన్న చింతపండు నానుతుంది
  5. మూడు రోజుల తర్వాత మూత తెరిచి, పైన ఉన్న మిర్చి గుజ్జు తీసి పక్కన పెట్టేసి, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
  6. అందులో పక్కన ఉంచుకున్న మిర్చి గుజ్జును, మెంతి పిండిని, అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసి ఒక 2 నుండి 3 సెకన్ల పాటు మిక్సీ తిప్పాలి.
  7. తయారైన పచ్చడిని జాడీ లో ఉంచి భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి
  8. ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
  9. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, మిమునులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాదేవరకు వేయించి పచ్చట్లో వేసి బాగా కలపాలి.

Reviews for Red chilli pickle Recipe in Telugu (0)