తీపి మొక్కజొన్న జావ | Sweet Corn Soup Recipe in Telugu

ద్వారా Suma Malini  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet Corn Soup recipe in Telugu,తీపి మొక్కజొన్న జావ, Suma Malini
తీపి మొక్కజొన్న జావby Suma Malini
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

తీపి మొక్కజొన్న జావ వంటకం

తీపి మొక్కజొన్న జావ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet Corn Soup Recipe in Telugu )

  • మొక్కజొన్న గింజలు 2 కప్పులు
  • సత్తు పిండి (శెనగలు, మినుములు వేయించి మిల్లు పుట్టిన మెత్తని పిండి) 2 చెంచాలు
  • నీళ్ళు లేదా పాలు 500మి.ల్లీ
  • టమొట 1
  • మిరియం పొడి చిటికెడు
  • ఉప్పు (ఐచ్చికం) చిటికెడు
  • కొత్తిమీర తరుగు, నిమ్మరసం, నిమ్మరసం లో నానిన మిరప ముక్కలు

తీపి మొక్కజొన్న జావ | How to make Sweet Corn Soup Recipe in Telugu

  1. మొక్కజొన్న గింజలు ఒలిచి పెట్టుకోవాలి.
  2. సత్తు పిండి, సగం మొక్కజొన్న గింజలు, సగం టమొట గ్రైండ్ చేసుకోవాలి.
  3. పోయ్యిమీద గిన్నెలో నీళ్లు లేదా పాలు మరిగించాలి.
  4. మిగిలిన మెక్కజోన్న గింజలు,టమొటో ముక్కలు వేసి ఉడికించాలి.
  5. రుబ్బిన ముద్ద లో కొంచెం నీరు కలిపి మరుగుతున్న నీటిలో కలిపుతూ ఉండలు కట్టకుండా పోయాలి.
  6. కొంచెం దగ్గర పడి ఉడికాక దించుకోవాలి.
  7. మిరియం పొడి, ఉప్పు చల్లుకుని తాగాలి.
  8. సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం కలిపి నానబెట్టి నా మిర్చి ముక్కలు తో తింటే మరింత రుచిగా ఉంటుంది. మిరియం పొడి ఉప్పు కన్నా బాగుంటుంది.

నా చిట్కా:

వేగన్ డైట్ వారు లేదా సత్తు పిండి పాలకు బదులుగా సోయా పాలు, కొబ్బరి పాలు లేదా బాదం పాలు వాడుకోవచ్చు.

Reviews for Sweet Corn Soup Recipe in Telugu (0)