మామిడికాయ రవ్వ పులిహోర | Ravva pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ravva pulihora recipe in Telugu,మామిడికాయ రవ్వ పులిహోర, Sree Vaishnavi
మామిడికాయ రవ్వ పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మామిడికాయ రవ్వ పులిహోర వంటకం

మామిడికాయ రవ్వ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ravva pulihora Recipe in Telugu )

  • పచ్చిమామిడికాయ తురుము: 2 కప్పులు
  • బియ్యం రవ్వ: 4 కప్పులు
  • ఆవాలు: 2 చెంచాలు
  • శెనగపప్పు: 2 చెంచాలు
  • మినప్పప్పు: 2 చెంచాలు
  • వేరుశెనగ పప్పు: 4 చెంచాలు
  • జీడిపప్పులు: 10
  • పచ్చిమిర్చి: 8
  • ఎండుమిర్చి:4
  • ఇంగువ
  • పసుపు: 2 చెంచాలు
  • కరివేపాకు: 4రెబ్బలు
  • నూనె: తగినంత
  • ఉప్పు: రుచికి సరిపడా

మామిడికాయ రవ్వ పులిహోర | How to make Ravva pulihora Recipe in Telugu

  1. ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ నాలుగు టీసూప్న నూనె తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
  2. తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి.
  3. ఇప్పుడు పాన్ లో తగినంత నూనె వేసి వేడయ్యాక ఇంగువ ఆవాలు శెనగపప్పు మినప్పప్పు వేరుశెనగ పప్పు వేసి వేయించాలి.
  4. తరువాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు జీడిపప్పులను వేసి దోరగా వేయించాలి.
  5. ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా వేసి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి
  6. ఇప్పుడు ఈ మిశ్రమంలో మొదటగా ఉడికించి సిద్దం చేసి పెట్టుకొన్న బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి.
  7. అంతే కమ్మగా పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ దీన్ని అలాగే వేడి వేడిగా తింటే చాలా రుచిగా వెరైటీగా ఉంటుంది

Reviews for Ravva pulihora Recipe in Telugu (0)