హోమ్ / వంటకాలు / ఝుణ్కా

Photo of Jhunka by Sushma Subramanyam at BetterButter
459
0
0.0(0)
0

ఝుణ్కా

Jun-26-2018
Sushma Subramanyam
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఝుణ్కా రెసిపీ గురించి

ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు చూడడానికి చక్కగా, రుచిగా, త్వరగా తయారు అయ్యే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. శనగపిండి - 1/2 కప్పు (200 మిలీ కప్పులో)
  2. నీళ్లు- 1 కప్పు
  3. వేయించిన వేరుశనగపప్పు -1 టేబుల్ స్పూన్
  4. వెల్లుల్లి -1 రెబ్బ
  5. పచ్చిమిర్చి- 1
  6. ఎండుమిర్చి పొడి- 1 టీ స్పూన్
  7. ధనియాలు -1/2 టీ స్పూన్
  8. ఆవాలు - 1/4 టీ స్పూన్
  9. జీలకర్ర -1/4 టీ స్పూన్
  10. వాము -1/8 టీ స్పూన్
  11. ఇంగువ - చిటికెడు
  12. కత్తిరించిన కరివేపాకు - 4-5 ఆకులు
  13. సన్నగా కత్తిరించిన ఉల్లిపాయ - 1/2 చిన్నది
  14. పసుపు - చిటికెడు
  15. చింతపండు పులుసు- 1/2 టీ స్పూన్
  16. బెల్లం - 1/2 టీ స్పూన్
  17. ఉప్పు - తగినంత
  18. ఎండుకొబ్బరి తురుము- 1 టేబుల్ స్పూన్
  19. కత్తిరించిన కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
  20. వేయించిన నువ్వులు - 1/2 టీ స్పూన్
  21. నూనె- 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. వేరుశనగపప్పు, వెల్లుల్లి రెబ్బ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి, ధనియాలు - ఇవి మిక్సీలో దోరగా పొడి చేసిపెట్టుకోవాలి
  2. జల్లిపట్టిన శనగపిండిని నీళ్లలో కలిపి పెట్టుకోవాలి
  3. ఒక మూకుడులొ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వాము, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ వేసి పోపు తయారు చేసుకోవాలి
  4. పోపులోకి తయారుగా పెట్టుకున్న వేరుశెనగపోడి, పసుపు వేసి వేపుకోవాలి
  5. వేపుకున్న పోపులోకి శనగపిండి, చింతపండు పులుసు, బెల్లం‌, ఉప్పు వేసి దగ్గర పడేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించుకోవాలి
  6. నూనెరాసిపెట్టుకున్న పళ్ళెంలోకి దగ్గరపడిన మిశ్రమాన్ని పరుచుకోవాలి
  7. ఎండుకొబ్బరి తురుము, నూగులు, కొత్తిమీర చల్లుకుని అలంకరించుకోవాలీ
  8. ముక్కలు చేసి చపాతీలు కానీ, జొన్న రొట్టెలతో కానీ వడ్డించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర