టమాట రైస్ | Tomato rice Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  27th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato rice recipe in Telugu,టమాట రైస్, Ganiprameela Ganiprameela
టమాట రైస్by Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

టమాట రైస్ వంటకం

టమాట రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato rice Recipe in Telugu )

  • బాసుమతి రైస్ 1కప్
  • టమాటలు 1/4 కేజి
  • నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  • జీడి పప్పు 7-8
  • లవంగాలు 3-4
  • ఇలాచీలు 2
  • చిన్న ముక్క దాల్చిన చెక్క
  • జాజికాయ చిన్న ముక్క
  • షాజీర 1/2 స్పూన్
  • బిర్యానీ ఆకు
  • పచ్చిమిర్చి 4-5
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1స్పూన్
  • కొత్తిమీర పుదీన 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • ఉల్లిగడ్డ 1

టమాట రైస్ | How to make Tomato rice Recipe in Telugu

  1. ముందుగా బాసుమతి రైస్ ఒక్క సారి కడిగి నీళ్ళు పోసి పెట్టుకోవాలి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక
  3. జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి
  4. అదే పాన్ లో ఇంకొద్దిగ నెయ్యి వేసి మసాల ఐటమ్స్ బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి
  5. ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర పుదీన తరిగి వేసుకోవాలి
  6. తరువాత అల్లం వేల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  7. టమాటలు జ్యూస్ లాగ గ్రైండ్ చేసి 1 కప్ జ్యూస్ 1 కప్ నీళ్ళు వేసి ఉప్పు వేసీ మరిగించాలి
  8. మరుగుతున్న పోపు లో నాన పెట్టిన బాసుమతి రైస్ వేసి ఉడికించాలి
  9. చివరిగా నెయ్యిలో వేపిన జీడిపప్పు రైస్ లో వేసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి

Reviews for Tomato rice Recipe in Telugu (0)