ఖర్జూరం నిల్వ పచ్చడి | Dates pickle Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  29th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dates pickle recipe in Telugu,ఖర్జూరం నిల్వ పచ్చడి, Indira Bhaskar
ఖర్జూరం నిల్వ పచ్చడిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

ఖర్జూరం నిల్వ పచ్చడి వంటకం

ఖర్జూరం నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dates pickle Recipe in Telugu )

  • గింజలు తీసేసిన ఖర్జూరం పండ్లు 15
  • చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్లు
  • కారం 1 1/2 టేబుల్ స్పూన్
  • ఉప్పు 1/2 టేబుల్ స్పూన్
  • గానుగ నూనె 2 స్పూన్లు
  • వేయించిన ఆవాలు , మెంతుల పొడి 1/4 స్పూన్
  • ఆవాలు కొద్దిగా
  • మెంతులు కొద్దిగా

ఖర్జూరం నిల్వ పచ్చడి | How to make Dates pickle Recipe in Telugu

  1. ఖర్జూరం పండ్ల నుండి గింజలు తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి.
  3. తర్వాత అందులో కట్ చేసుకున్న ఖర్జూరాన్ని వేయాలి.
  4. ఖర్జూరం కొద్దిసేపు బాగా వేగిన తర్వాత తీసి వేరొక పళ్ళెంలో పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు మరికొంచెం నూనె వేసి అందులో చింతపండు గుజ్జు వేసి బాగా మగ్గనివ్వాలి.
  6. ఇప్పుడు అందులో ఉప్పు కారం వేసి మగ్గనివ్వాలి.
  7. ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఖర్జూరం కూడా వెయ్యాలి.
  8. ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతిపొడి వేసి బాగా కలపాలి.
  9. పైకి నూనె అంత వచ్చేవరకు ఉంచాలి.
  10. అంతే ఎంతో రుచికరమైన ఖర్జూరం పచ్చడి రెడీ.
  11. దీనిని వేడివేడి అన్నం ,ఇడ్లీ ,దోస ,చపాతి పూరి దేనితో కలిపి తిన్న చాలా అద్భుతంగా ఉంటుంది.

నా చిట్కా:

దీనిలో కొద్దిగా నీరు కలిపి తీసుకుంటే అల్పాహారంలో కి చెట్నీ రెడీ.నచ్చిన వారు ఇంగువ లేదా అల్లం,వెల్లుల్లి ముక్కలు వెయ్యచ్చ

Reviews for Dates pickle Recipe in Telugu (0)