ఉగ్గాని | Uggani Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Uggani recipe in Telugu,ఉగ్గాని, Sree Vaishnavi
ఉగ్గానిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఉగ్గాని వంటకం

ఉగ్గాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Uggani Recipe in Telugu )

  • మరమరాలు : అరకేజీ
  • ఆవాలు 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • మినప్పప్పు 1 టేబుల్ స్పూన్
  • శెనగపప్పు 1 టేబుల్ స్పూన్
  • పల్లీలు : 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి : 6-8 (కారానికి సరిపడా)
  • ఉల్లిపాయ : ఒకటి
  • టమాటా : ఒకటి
  • కరివేపా : రెండు రెమ్మలు
  • కొత్తిమీర : గుప్పెడు
  • పసుపు : ఒక టీ స్పూన్
  • నూనె : 4 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు : తగినంత
  • పుట్నాలు (ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్) : అర కప్పు
  • ఎండుకొబ్బరి : కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 6-8

ఉగ్గాని | How to make Uggani Recipe in Telugu

  1. ముందుగా ఓ పెద్ద గిన్నెలో సగానికి పైగా నీరు పోసి అందులో మరమరాలు వేసి ఓ 5 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  2. ఈలోపుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుకొబ్బరి, వెల్లుల్లి, పుట్నాలు వేసుకొని కచ్చపచ్చాగా పొడి చేసుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి, మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి.
  4. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, వేరుశెనగ పప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  5. అదే నూనెలో రెండుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి.
  6. ఆ తర్వాత చివరిగా ఉందులో ఉప్పు కూడా చేర్చాలి.
  7. ఈ మిశ్రమం అంతా దోరగా వేగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బొరుగులను గట్టిగా నీరు లేకుండా పిండి, బాణలిలో వేయాలి.
  8. బొరుగులకు పోపు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  9. ఆ తర్వాత చివరిగా ఈ మిశ్రమానికి మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని జోడించాలి.
  10. చివరిగా కొత్తిమీరను చేర్చుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే బొరుగులు ఉప్మా (ఉగ్గాని) రెడీ..!

నా చిట్కా:

సాధారణంగా ఉగ్గానితో మిర్చి బజ్జీ కాంబినేషన్ భలే రుచిగా ఉంటుంది. అలా కాదనుకుంటే అరటికాయ బజ్జీ

Reviews for Uggani Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo