పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర | Chana dal coconut curry Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chana dal coconut curry recipe in Telugu,పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర, Indira Bhaskar
పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూరby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర వంటకం

పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana dal coconut curry Recipe in Telugu )

  • పచ్చిశనగపప్పు ఒక కప్పు
  • కొబ్బరికోరు 4 చెంచాలు
  • నూనె ఒక చెంచాడు
  • ఉప్పు పావు టీ స్పూను
  • ఆవాలు పావు టీ స్పూను
  • జీలకర్ర పావు టీ స్పూను
  • మినప్పప్పు పావు టీ స్పూను
  • శెనగపప్పు పావుటీస్పూను
  • ఎండుమిరపకాయలు రెండు
  • ఇంగువ చిటికెడు
  • పసుపు కొద్దిగా
  • కరివేపాకు ఒక రెమ్మ

పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర | How to make Chana dal coconut curry Recipe in Telugu

  1. ముందుగా శనగపప్పుని కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకపెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ పసుపు కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అందులో ఉడకపెట్టిన శనగపప్పు ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
  4. తర్వాత అందులో కొబ్బరి తురుమును వేసి మరి కొద్ది సేపు ఉంచి దించుకుంటే గుమగుమలాడే కమ్మని శనగపప్పు కొబ్బరికోరు కూర రెడీ.

నా చిట్కా:

దీనిని వంకాయ పచ్చి పులుసు,ముక్కల పులుసుతో కలిపి తీసుకుంటే బాగుంటుంది.

Reviews for Chana dal coconut curry Recipe in Telugu (0)