హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి) | Healthy carrot pickle Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Healthy carrot pickle recipe in Telugu,హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి), Indira Bhaskar
హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి)by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి) వంటకం

హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Healthy carrot pickle Recipe in Telugu )

  • క్యారెట్ పెద్దది ఒకటి
  • నిమ్మకాయలు నాలుగు
  • ఉప్పు ఒక చెంచాడు
  • కారం రెండు చెంచాలు
  • ఆవాలు మెంతులు కలిపి వేయించిన పొడి పావు చెంచా
  • జీలకర్ర పొడి పావు చెంచా
  • ఇంగువ చిటికెడు
  • నువ్వుల నూనె రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి చిన్నది 1
  • కొత్తిమీర కొద్దిగా

హెల్తీ క్యారెట్ పికిల్ (పచ్చడి) | How to make Healthy carrot pickle Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్ ముక్కలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. నిమ్మకాయలను రసం తీసి పెట్టాలి.
  3. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో క్యారట్ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి ఉంచాలి.
  4. తర్వాత అందులో, కారం ,ఆవాలు మెంతులు వేయించి చేసిన పొడి , జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఇందులో కాచిన ఇంగువ నూనె వేసి కలపాలి.
  6. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ క్యారెట్ పికెల్ రెడీ.
  7. దీనిని పప్పు అన్నం పెరుగు అన్నంలో నలుచుని తినడానికి ఎంతో బాగుంటుంది.

నా చిట్కా:

దీనిని ఒక రోజు ఊరిన తరువాత తింటే మరింత రుచిగా ఉంటుంది.

Reviews for Healthy carrot pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo