మామిడి కాయ పులుసు | mango rasam Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • mango rasam recipe in Telugu,మామిడి కాయ పులుసు, Indira Bhaskar
మామిడి కాయ పులుసుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    15

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

మామిడి కాయ పులుసు వంటకం

మామిడి కాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make mango rasam Recipe in Telugu )

  • మామిడికాయ పెద్దది ఒకటి
  • టమాట 1
  • సొరకాయ ముక్క చిన్నది
  • ములక్కాడ 1
  • పచ్చిమిర్చి 2
  • కొత్తిమీర కొద్దిగా
  • కరివేపాకు ఒక రెమ్మ పసుపు పావు స్పూను
  • ఉప్పు ఒక చెంచాడు
  • కారం అరచెంచా
  • ఆవాలు మెంతులు వేయించిన పొడి పావు స్పూను
  • జీలకర్ర పొడి పావు స్పూను
  • ఇంగువ కొద్దిగా
  • పసుపు పావు చెంచా
  • బెల్లం లేదా పంచదార ఆప్షనల్ ఒక చెంచా
  • నూనె లేదా నెయ్యి రెండు చెంచాలు
  • ఆవాలు పావు స్పూను
  • జీలకర్ర పావు స్పూను
  • ఎండుమిరపకాయలు రెండు

మామిడి కాయ పులుసు | How to make mango rasam Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ ముక్కలు , సొరకాయ ముక్కలు ,టమాటా, ములక్కాడ ,పచ్చిమిర్చి ఒక గిన్నెలో వేసి దాంట్లో ఒక లీటరు నీళ్ళు పోసి ,పసుపు వేసి బాగా ఉడకపెట్టాలి.
  2. ముక్కలు బాగా ఉడికాక పంచదార లేదా బెల్లం ఉప్పు వేసి ఇంకొంచెం సేపు మరిగించాలి.
  3. ఇప్పుడు అందులో ఆవాలు మెంతుల పొడి జీలకర్ర పొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు దీంట్లో నీరు సరిపోకపోతే కొంచెం నీరు పోసి పులుసులా అయ్యేవరకు చూసుకుని మరి కొంచెం సేపు మరగనివ్వాలి.
  5. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  6. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని పైన పుసులోకలిపితే మామిడి కాయ పులుసు సిద్ధం.
  7. దీనికి పైన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేస్తే పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ, సొరకాయ పులుసు రెడీ.

నా చిట్కా:

తీపి చుట్టు పడనివారు ఇందులో తీపి వేసుకోకుండానే చేసుకోవచ్చు.

Reviews for mango rasam Recipe in Telugu (0)