మీల్ మేకర్ బిరియాని | Meal maker biriyani Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Meal maker biriyani recipe in Telugu,మీల్ మేకర్ బిరియాని, Sree Vaishnavi
మీల్ మేకర్ బిరియానిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    24

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మీల్ మేకర్ బిరియాని వంటకం

మీల్ మేకర్ బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Meal maker biriyani Recipe in Telugu )

  • బియ్యం : 1cup
  • నెయ్యి : 2tsp
  • లవంగాలు,చెక్క,యాలుకలు,బిర్యనిఆకు :రెండు రెండు చొప్పున
  • మీల్ మేకర్ : 1/2cup
  • ఉప్పు : తగినంత
  • పుదినా : ఒక కట్ట
  • కొత్తిమీర : ఒక కట్ట
  • బిర్యానీ మసాలా : 1tsp
  • ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు : 1/2cup

మీల్ మేకర్ బిరియాని | How to make Meal maker biriyani Recipe in Telugu

  1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. మీల్ మేకర్ వేడినీళ్ళల్లోవేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి పక్కనపెట్టాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
  4. నెయ్యి వేడి అయ్యిన తరువాత చెక్క, లవంగాలు, యలుకులు, బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.
  5. అవి వేగాక పుదినా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  6. తరువాత పక్కన పెట్టిన మిల్ మేకర్ వేసి కాసేపు వేయించి కడిగి నానబెట్టిన బియ్యం వేసి ఒక సారి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి దానిలో ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి
  7. కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  8. అంతే సర్వ్ చెయ్యటానికి మిల్ మేకర్ బిర్యానీ రెడి.

Reviews for Meal maker biriyani Recipe in Telugu (0)