చలిమిడి | Chalimidi Recipe in Telugu

ద్వారా Shailaja R  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chalimidi recipe in Telugu,చలిమిడి, Shailaja R
చలిమిడిby Shailaja R
  • తయారీకి సమయం

    4

    గంటలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

చలిమిడి వంటకం

చలిమిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chalimidi Recipe in Telugu )

  • తడిబియ్యం పిండి - 2 కప్పులు
  • చెక్కర - 3/4 కప్పు
  • ఎండుకొబ్బరి ముక్కలు - 1/2 కప్పు
  • యిలాచి పొడి - 1 టీ స్పూన్
  • బాదం పలుకులు - 3 టేబుల్ స్పూన్
  • నెయ్యి - 3 టేబుల్ స్పూన్

చలిమిడి | How to make Chalimidi Recipe in Telugu

  1. బియ్యం పిండి తయారీ :
  2. బియ్యాన్ని నీళ్లతో కడిగి 3 గంటలు నానబెట్టాలి.
  3. తరువాత నీళ్ళు వొంపేసి, బియ్యాన్ని బట్ట మీద పరచి 20 నిమిషాలు ఉంచాలి.
  4. బియ్యాన్ని మిక్సి జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
  5. ఒక పాన్ లో నెయ్యి వేసి కాగాక బాదం పలుకులు, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేయించి పక్కన పెట్టాలి.
  6. చెక్కర పాకం తయారీ:
  7. ఒక గిన్నెలో చెక్కర, నీళ్లు పోసి స్టౌవ్ మీద పెట్టి కలపాలి.
  8. మనకి ఉండ పాకం కావాలి.
  9. పాకం వచ్చాక పాన్ ని స్టౌవ్ మీది నుంచి తీయాలి. దీనిలో వేయించిన బాదం, కొబ్బరి ముక్కలు, బియ్యం పిండి వేసి బాగా కలపాలి.
  10. బాగా కలిపాక బౌల్లోకి తీసుకుని తినాలి.

నా చిట్కా:

1. చెక్కర పాకం ఉండ పాకం రావాలి. 2. షాప్ లో కొన్న బియ్యం పిండి వాడద్దు.

Reviews for Chalimidi Recipe in Telugu (0)