చూర్మొ - గోవా స్వీట్ | Churmo - Goan Sweet Recipe in Telugu

ద్వారా Shailaja R  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Churmo - Goan Sweet recipe in Telugu,చూర్మొ - గోవా స్వీట్, Shailaja R
చూర్మొ - గోవా స్వీట్by Shailaja R
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

చూర్మొ - గోవా స్వీట్ వంటకం

చూర్మొ - గోవా స్వీట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Churmo - Goan Sweet Recipe in Telugu )

  • పూరీ కోసం :
  • గోధుమ పిండి - 150 గ్రాములు
  • చపాతి రుద్దడానికి - 1/4 cup
  • నూనె వేయించడానికి
  • బెల్లం పాకం కోసం :
  • బెల్లం తరిమినది - 150 గ్రాములు
  • నీళ్లు.- 100 మిల్లీలీటర్లు
  • కారం - 2 టీ స్పూన్లు
  • ప్లేట్ కి పుయడానికి 1 టేబుల్ స్పూన్

చూర్మొ - గోవా స్వీట్ | How to make Churmo - Goan Sweet Recipe in Telugu

  1. ఒక బౌల్ లో గోధుమ పిండి, నీళ్లు కలిపి ముద్ద చేయాలి.
  2. నూనె బాండీ లో పోసి కాగనివ్వాలి.
  3. ఈ పిండిని 8 భాగాలుగా చేయాలి. వీటిని పూరీలాగా రుద్దాలి.
  4. ఈ పూరీలను నూనె లో గట్టిగా ( క్రిస్పగా) వేయించాలి.
  5. పూరీలు చల్లారాక చేతితో నలపాలి. పూరీ ముక్కలుగా ఉంటుంది.
  6. బెల్లం పాకం కోసం :
  7. ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు కలిపి స్టౌవ్ మీద పెట్టి కలపాలి. ముదురు పాకం రావాలి.
  8. పాకం వచ్చాక కారం వేసి కలిపి, స్టౌవ్ మీది నుంచి దించాలి.
  9. దించిన గిన్నెలో పూరి ముక్కలు వేసి బాగా కలపాలి.
  10. చల్లారాక డబ్బాలో పెట్టాలి.

Reviews for Churmo - Goan Sweet Recipe in Telugu (0)