మైసూరుపాక్ | Mysore pak Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mysore pak recipe in Telugu,మైసూరుపాక్, Sree Vaishnavi
మైసూరుపాక్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మైసూరుపాక్ వంటకం

మైసూరుపాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysore pak Recipe in Telugu )

  • శనగపిండి - ఒక కప్పు
  • చక్కెర - ఒక కప్పు
  • నెయ్యి - రెండు కప్పులు
  • సోడా - చిటికెడు.

మైసూరుపాక్ | How to make Mysore pak Recipe in Telugu

  1. నెయ్యి కుంపటిసెగని ఒక్కసారి కాగనియ్యాలి.
  2. చక్కెరలో కొంచెం నీళ్ళుపోసి కలిపి కుంపటిమీద పెట్టాలి. చక్కెర కరిగేదాకా ఉడకనివ్వాలి.
  3. చక్కెర పాకం ఉడుకుతూ ఉండగానే నెయ్యిలో నాలుగోవంతు భాగం పాకంలో పోసి; కలిపి శనగపిండి కూడా వేసి గరిటెతో అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి.
  4. నెయ్యి ఇగిరినప్పుడల్లా మాడకుండా నెయ్యిపోస్తూ, తిప్పుతూ ఉండాలి.
  5. నెయ్యి అంతా పూర్తిగా అయేసరికి శనగపిండి పాకంలో ఉడికి, నేతిలోవేగి, విడిపోయి, తెల్లగా నురుగు లాగా కనిపిస్తుంది.
  6. అప్పుడు చిటికెడు సోడా వేసి మరోసారి కలియబెట్టి వెంటనే పళ్ళెంలోకి కుమ్మరించాలి. వెంటనే గరిటెతోగాని అట్లకాడతోగాని పైపైన మెల్లగా వత్తాలి.
  7. వేడిలోనే కత్తితో మనకి కావలసిన ఆకారాలలో కోసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలు విడివిడిగా వస్తాయి.

నా చిట్కా:

పేరుకున్న నెయ్యిని ఉపయోగించకూడదు. నెయ్యిని మరిగించిన తర్వాత వేడిగా ఉండగానే కలపాలి

Reviews for Mysore pak Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo