కాజు ఆపిల్ స్వీట్ | Kaju apple sweet Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kaju apple sweet recipe in Telugu,కాజు ఆపిల్ స్వీట్, Tejaswi Yalamanchi
కాజు ఆపిల్ స్వీట్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కాజు ఆపిల్ స్వీట్ వంటకం

కాజు ఆపిల్ స్వీట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju apple sweet Recipe in Telugu )

  • జీడిపప్పు : 1 కప్
  • పంచదార : 1/2 కప్
  • నీరు : 1/4 కప్
  • లవంగాలు తగినన్ని
  • రెడ్ ఫుడ్ కలర్
  • నెయ్యి తగినంత

కాజు ఆపిల్ స్వీట్ | How to make Kaju apple sweet Recipe in Telugu

  1. పోయి వెలిగించి దాని మీద ఒక నాన్స్టిక్ పాన్ పెట్టి దాంట్లో పంచదార నీరు వేసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి
  2. పాకం కొంచెం నీటిలో వేస్తే అది కలిసిపోకుండా ఇలా కనిపిస్తే గనుక మీకు పాకం తయారయినట్టు
  3. మిక్సీ జార్ లో జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసుకోండి
  4. తయారైన పాకంలో జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకుని బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటు ఉండాలి
  5. జిడిపప్పు మిశ్రమం గట్టిపడ్డాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని 5 నిమిషాలు చాలరనివాలి
  6. 5 నిమిషములు తారువత ఒక చెంచా నెయ్యి వేసి బాగా మెత్తగా కలుపుకోండి
  7. బాగా మెత్తగా చక్కటి ఉండలు తయారు చేసుకునే లాగా ఆవలి
  8. మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చక్కటి రౌండ్గా ఉండలుగా చేసుకొండి
  9. ఒక గిన్నెలో కాస్త రెడ్ ఫుడ్ కలర్ వేసి బ్రష్ సహాయంతో ఉండలకు రంగు వెయ్యండి
  10. ఈ విధంగా రంగు వేసుకోవాలి
  11. దానిపైన లవంగాన్ని ఈ రకంగా గుచ్చుకోవాలి
  12. అన్ని ఉండలకు ఇలాగే చేసుకోండి
  13. అంతే కాజు ఆపిల్ స్వీట్ తయారు

నా చిట్కా:

జిడిపప్పు మిశ్రమం బాగా గట్టిగా ఉంది అనుకుంటే కాస్త పాలు చల్లి మెత్తగా చేస్కోవొచ్చు

Reviews for Kaju apple sweet Recipe in Telugu (0)