మిని మడత కాజాలు | Mini Madata Kaja Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mini Madata Kaja recipe in Telugu,మిని మడత కాజాలు, Indira Bhaskar
మిని మడత కాజాలుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

మిని మడత కాజాలు వంటకం

మిని మడత కాజాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mini Madata Kaja Recipe in Telugu )

  • మైదా పిండి ఒక కప్పు
  • పంచదార ఒకటిన్నర కప్పు
  • నెయ్యి రెండు స్పూన్లు
  • నూనె డీప్ఫ్రైకి సరిపడా

మిని మడత కాజాలు | How to make Mini Madata Kaja Recipe in Telugu

  1. ముందుగా మైదాపిండిని నెయ్యి సరిపడినంత నీరు పోసి చపాతి పిండిలా కలుపుకుని 15 నిమిషాలపాటు నానపెట్టాలి.
  2. ఇప్పుడు ఒక బాండీలో పంచదార వేసి చిన్న గ్లాసు నీళ్లు పోసి కలపాలి.
  3. దీనిని తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
  4. ఇప్పుడు తీగ పాకం వచ్చాక తీసి పక్కన పెట్టాలి.
  5. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని పలుచగా చపాతీలా పెద్ద గా వత్తుకుని దాని మీద కొంచెం మైదాపిండి జల్లి దానిని గుండ్రంగా మడతపెడుతూ రోల్ చేయ్యాలి.
  6. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గోరు తో ఒకసారి ప్రెస్ చేయ్యాలి.
  7. ఇప్పుడు మూకుట్లో నూనె వేసి బాగా కాగాక ఈ కట్ చేసుకున్న కాజాలను వేసి చిన్న మంట మీద దోరగా ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  8. వీటిని పైన చేసుకున్న పాకం మిశ్రమంలో 5 నిమిషాలు ఉంచి తీసుకుంటే మిని మడత కాజా రెడీ.

నా చిట్కా:

పిండిని మరీ గట్టిగా కాకుండా మెత్తగా మృదువుగా కలుపుకోవాలి లేదంటే కాజాలు గట్టిగా ఉంటాయి.

Reviews for Mini Madata Kaja Recipe in Telugu (0)