హోమ్ / వంటకాలు / అరటిపండు హల్వా

Photo of Banana halwa by Tejaswi Yalamanchi at BetterButter
527
0
0.0(0)
0

అరటిపండు హల్వా

Jul-05-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు హల్వా రెసిపీ గురించి

అరటి పండ్లు బాగా పండి పోయాయని బాధపడుతున్నారా!! తీసి బయటపడేదామని అనుకుంటున్నారా !! అయితే చక్కగా ఇలాగా హల్వా చేసుకొని ఆనందంగా ఆస్వాదిస్తూ తినండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పండిన అరటిపండ్లు : 2
  2. పంచదార : 4 చెంచాలు + 6 చెంచాలు
  3. కిస్మిస్ : 8
  4. జీడిపప్పు : 6
  5. బాదంపప్పు : 6
  6. నెయ్యి : 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పండిన అరటిపండ్లను తీసుకోండి తొక్క తీసి వాటిని మిక్సీలో వేయండి.
  2. వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి
  3. ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసి కిస్మిస్ బాదంపప్పు జీడిపప్పు ని ముక్కలుగా చేసుకుని వాటిని నెయ్యి లో వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి
  4. ఇప్పుడు అదే బాండీలో ఒక చెంచా నెయ్యి వేసి పేస్ట్లా చేసుకున్న అరటిపండు గుజ్జును వేసి నాలుగు చెంచాల పంచదార వేసి బాగా కలుపుకొండి
  5. అరటిపండు గుజ్జు మొత్తం బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉండాలి
  6. ఇప్పుడు పక్కన పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టి దానిలో ఆరు చెంచాల పంచదార వేసి అది మునిగే వరకు నీళ్ళు పోసుకుని బాగా ముదురు పాకం వచ్చేంతవరకు మరగనివ్వాలి
  7. ముదురు పాకాని అరటిపండు మిశ్రమంలో వేసుకోండి
  8. బాగా కలుపుతూ ఉండండి ఒక రెండు నిమిషాల తరువాత ఇంకో 2 చెంచాల నెయ్యి వేసి బాగా కలపండి
  9. బాగా కలుపుతూ ఉండండి హల్వా బాండికి అతుక్కోకుండా పక్కల కాస్త నెయ్యి వదులుతూ ఉంటే హల్వా తయారు అయినట్టు
  10. ఇప్పుడు దాంట్లో వేయించిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకుని చక్కగా కలుపుకోండి
  11. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ హల్వాను దాంట్లో వేసుకొని చల్లార్చండి
  12. హల్వా చల్లారిన తర్వాత ముక్కలుగా చేసుకుని ఆస్వాదించండి
  13. అంతే అరటిపండు హల్వా తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర