హోమ్ / వంటకాలు / సందేష్

Photo of Sandesh by Sree Sadhu at BetterButter
355
3
0.0(0)
0

సందేష్

Jul-05-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సందేష్ రెసిపీ గురించి

ఇది చాలా సాంప్రదాయకరమైన వంటకం మాత్రమే కాదు, రుచికరమైనది కూడా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పశ్చిమ బెంగాల్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. పూర్తిగా క్రీమ్ మిల్క్: 1 లీటర్
  2. నిమ్మరసం: 1 చెంచా
  3. పంచదార పొడి: 4 చెంచాలు
  4. పాల పొడి: 2 చెంచాలు
  5. యాలకుల పొడి: 1 చెంచా
  6. డ్రై ఫ్రూట్స్: గార్నిషింగ్

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి పాత్రను స్టౌ మీద పెట్టి పాలను బాగా మరగ కాచాలి. 
  2. బాగా కాగుతున్నప్పుడు అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. నిమ్మరసం చేర్చిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
  3. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాని మీద ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని చుట్టి, కాగబెట్టుకొన్న, పాలను(నిమ్మరసం వేసిన తర్వాత పెరుగులా మారిన పాలను)పోసి వడగట్టుకోవాలి 
  4. పాలు ఏ మాత్రం తేమలేకుండా వడిగిపోయేంతవరకూ మూట కట్టి టాప్ కు వేలాడదీసి, ఒక గంట పాటు అలాగే ఉంచాలి . దాంతో అదనపు తేమ అంతా పూర్తిగా తొలగిపోతుంది
  5. ఇప్పుడు దాన్ని పక్కకు తీసుకొని ఒక పాన్ లో వేసి, అందులో పంచదార, పాలపొడి, మరియు యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
  6. మీ చేతి వేళ్ళను ఉపయోగించి బాగా కలగలుపుకోవాలి
  7. నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో చన్న వేసి ఒక నిముషం వేడి చేసుకోవాలి. అలా చేయడం వల్ల అదనంగా ఏమైన ఉన్న తేమను పూర్తిగా డ్రై చేస్తుంది. దీన్ని కొన్ని నిముషాలు చల్లారనివ్వాలి.
  8. ఇప్పుడు కొద్దిగా అరచేతిలోనికి తీసుకొని బాగా మాష్ చేసి చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి తర్వాత కొద్దిగా కట్ లెట్ లేదా వడలా తట్టుకోవాలి .
  9. దాని మీద డ్రై ఫ్రూట్స్ ను గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర