కాజు పుచ్చకాయ స్వీట్ | Kaju Watermelon Sweet Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kaju Watermelon Sweet recipe in Telugu,కాజు  పుచ్చకాయ స్వీట్, Tejaswi Yalamanchi
కాజు పుచ్చకాయ స్వీట్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కాజు పుచ్చకాయ స్వీట్ వంటకం

కాజు పుచ్చకాయ స్వీట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju Watermelon Sweet Recipe in Telugu )

  • జిడిపప్పు : 1 కప్
  • పంచదార : 1/2 కప్
  • నీరు : 1/4 కప్
  • నువ్వులు తగినన్ని
  • రెడ్ ఫుడ్ కలర్
  • గ్రీన్ ఫుడ్ కలర్
  • నెయ్యి తగినంత

కాజు పుచ్చకాయ స్వీట్ | How to make Kaju Watermelon Sweet Recipe in Telugu

  1. పోయి వెలిగించి దాని మీద ఒక నాన్స్టిక్ పాన్ పెట్టి దాంట్లో పంచదార నీరు వేసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి
  2. పాకం కొంచెం నీటిలో వేస్తే అది కలిసిపోకుండా ఇలా కనిపిస్తే గనుక మీకు పాకం తయారయినట్టు
  3. మిక్సీ జార్ లో జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసుకోండి
  4. తయారైన పాకంలో జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకుని బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటు ఉండాలి
  5. జిడిపప్పు మిశ్రమం గట్టిపడ్డాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని 5 నిమిషాలు చాలరనివాలి
  6. 5 నిమిషములు తారువత ఒక చెంచా నెయ్యి వేసి బాగా మెత్తగా కలుపుకోండి
  7. బాగా మెత్తగా చక్కటి ఉండలు తయారు చేసుకునే లాగా అవ్వాలి
  8. మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఇలా 3 భాగాలుగా ,ఒకటి రెడ్ కలర్ కలపండి,ఇంకొకటి గ్రీన్ ఫుడ్ కలర్ కలపండి,ఇంకొకటి మాములుగా ఉంచండి
  9. రెడ్ కలర్ వేసిన దానిలో నువ్వులు వేయి కలపండి
  10. రెడ్ ఉండని కలర్ లేని ఉండాలో పెట్టి,మళ్ళీ ఉండాలాగా చేస్కోండి
  11. దానిని గ్రీన్ మిశ్రమంలో పెట్టి ఇలా ఉండలుగా చేస్కోండి
  12. ఒక 5 నిమిషులు తరువాత ముక్కలుగా చేస్కోండి
  13. అంతే కాజు పుచ్చకాయ స్వీట్ తయారు.

నా చిట్కా:

జిడిపప్పు మిశ్రమం బాగా గట్టిగా ఉంది అనుకుంటే కాస్త పాలు చల్లి మెత్తగా చేస్కోవొచ్చు

Reviews for Kaju Watermelon Sweet Recipe in Telugu (0)