హోమ్ / వంటకాలు / గుమ్మడికాయ మాల్ పువా

Photo of Gummadikaya malpuva by Lakshmi Leelavathi at BetterButter
578
1
0.0(0)
0

గుమ్మడికాయ మాల్ పువా

Jul-06-2018
Lakshmi Leelavathi
90 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడికాయ మాల్ పువా రెసిపీ గురించి

నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 7

  1. 1.గుమ్మడికాయ 1/4 kg
  2. 2.పంచదార 1 కప్పు.
  3. 3.కోవా 250 g
  4. 4.నూనె వేయించడానికి సరిపడా
  5. 5.యాలుకలు 5
  6. 6.జీడిపప్పు 15
  7. 7.మైదా 1 కప్పు

సూచనలు

  1. ముందుగా పూరీని తయారు చేసుకోవడానికి పదార్థాలు:;
  2. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో మైదా ఒక కప్పు తీసుకుని అందులో 100 g కోవాను, రెండు చెంచాల పంచదార,4,యాలుకలు పొడి చేసుకుని వేసుకోవాలి ఆ పిండిని బాగా కలిపి ఉండలు లేకుండా నీటితో కలుపుకోవాలి.
  3. తర్వాత గుమ్మడికాయ ను సగం కట్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  4. ఉడికిన గుమ్మడికాయను బయటికి తీసి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.తర్వాత ఆ పేస్ట్ ని పైన మనం కలుపుకున్న మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
  5. సగం గుమ్మడికాయను కూడా మెత్తగా ఉడికించుకుని,దానిని కూడా మిక్సీలో వేసుకుని పేస్ట్,లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  6. మలై చేసుకునే విధానం:::
  7. మలై చేసుకోవడానికి ముందుగా ఒక కడై తీసుకొని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో గుమ్మడికాయ గుజ్జుని వేసుకోవాలి.
  8. .సన్నని మంట పైన ఉడికించాలి.తర్వాత దానిలో కోవాని వేసుకుని బాగా కలపాలి.
  9. అలా ఒక పావుగంట ఆ మిశ్రమమం దగ్గర పడేదాక కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
  10. తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
  11. తర్వాత పాకం కోసం ఒక మందపాటి గిన్నెలో 1 కప్పు పంచదార తీసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకుని పొయ్యిమీద పెట్టి కలుపుతూ ఉండాలి.తీగ పాకం వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని అందులో 5 చుక్కల నిమ్మరసం పిండుకోవాలి.
  12. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో వేయించుకోవడానికి సరిపడా నూనెపోసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని గుండ్రటి గరిటతో కొంచెం, కొంచెం గా నూనెలో వేసుకోవాలి.పొయ్యి కింద మంట మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి.
  13. తర్వాత ఆ పూరీలను ముందుగా తయారు చేసుకున్న పాకం ఒక పళ్లెం లో పోసుకుని పళ్లెం లో ఒక్కో పూరీని ముంచి ఇంకో పళ్ళెంలో తీసుకోవాలి.
  14. తర్వాత ఆ పూరీలను పళ్ళెంలో పరచుకుని ముందుగా తయారు చేసుకున్న మలై ను మధ్యలో పెట్టుకుని గుండ్రంగా చుట్టుకోవాలి.
  15. అలా చుట్టు కున్న మలై పూరీలపై సన్నగా తరిగిన జీసిపప్పు చల్లి సర్వ్ చేయదనే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర