అటుకుల పాయసం | Poha payasam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poha payasam recipe in Telugu,అటుకుల పాయసం, Sree Vaishnavi
అటుకుల పాయసంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

అటుకుల పాయసం వంటకం

అటుకుల పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poha payasam Recipe in Telugu )

  • అటుకులు - ఒక కప్పు
  • పాలు - రెండున్నర కప్పులు
  • జీడిపప్పు - గుప్పెడు
  • యాలకుల పొడి - అర టీ స్పూను
  • నెయ్యి - రెండు టీ స్పూనులు
  • పంచదార- 1/2 కప్

అటుకుల పాయసం | How to make Poha payasam Recipe in Telugu

  1. అటుకులను ఓ నిమిషం పాటూ మంచి నీళ్లలో నాననివ్వాలి.
  2. తరువాత నీళ్లు ఒంపేసి, పక్కన పెట్టాలి.
  3. అటుకుల్లో కూడా నీరు ఎక్కువ శాతం లేకుండా పిండేయాలి.
  4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి జీడి పప్పు వేయించాలి.
  5. వేగాక పాలు పోసి బాగా మరిగించాలి.
  6. మరుగుతున్నప్పుడే పంచదార తురుము వేసి ఉడికించాలి
  7. పంచదార బాగా కరిగిపోయేలా చూడాలి.
  8. పంచదార పూర్తిగా కరిగాక అటుకుల్ని వేసి బాగా కలిపి, ఉడికించాలి.
  9. చివరగా యాలకుల పొడి చల్లాలి. ఓ నిమిషం తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే అటుకుల పాయసం రెడీ.

Reviews for Poha payasam Recipe in Telugu (0)