హోమ్ / వంటకాలు / క్యారెట్ బర్ఫీ

Photo of Carrot barfi by Indira Bhaskar at BetterButter
539
0
0.0(0)
0

క్యారెట్ బర్ఫీ

Jul-07-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ బర్ఫీ రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలకు ఎంతో బలమైనది మరియు అందరూ తినడానికి చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ తురుము ఒక కప్పు
  2. నెయ్యి రెండు చెంచాలు
  3. పాలు అరకప్పు
  4. పంచదార అరకప్పు
  5. పాలపొడి అరకప్పు
  6. యాలకులపొడి పావు టీ స్పూన్
  7. బాదం పప్పు జీడిపప్పు పలుకులు అర టీ స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి మూకుడులో నెయ్యి వేసి వేడెక్కాక దాంట్లో క్యారెట్ తురుము వేయ్యాలి.
  2. దీనిని ఒక ఐదు నిమిషాల పాటు రంగు మారేవరకు వేయించాలి.
  3. ఇప్పుడు ఇందులో పాలు పోసి దాన్ని బాగా ఉడకనివ్వాలి.
  4. ఇప్పుడు దీనిని పాలన్ని దగ్గర పడి ఇగిరే వరకూ ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు పైన ఉడుకుతున్న దాంట్లో పంచదార వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
  6. ఈ వుడుకుతున్న దాంట్లో పాలపొడి కూడా వేసి బాగా ఉండలు కట్టకుండా కలపాలి.
  7. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కూడా వేసి ఐదు నిమిషాలు దగ్గరపడేవరకు ఉంచి కలుపుతూ ఉండాలి.
  8. బాగా దగ్గరపడిన మిశ్రమాన్ని ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో వేసి పైన బాదం పప్పు జీడిపప్పు లతో అలంకరించుకుని చల్లారాక ముక్కలుగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బాదం బర్ఫీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర