సొరకాయ హల్వా | BOTTLEGOURD HALWA Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  8th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BOTTLEGOURD HALWA recipe in Telugu,సొరకాయ హల్వా, Tejaswi Yalamanchi
సొరకాయ హల్వాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

3

0

సొరకాయ హల్వా వంటకం

సొరకాయ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BOTTLEGOURD HALWA Recipe in Telugu )

  • తొక్క తీసి తురిమిన సొరకాయ : 1 కప్
  • పంచదార : ఆరు చెంచాలు
  • యాలుకలు : 3
  • నూనె : 1 చెంచా
  • నెయ్యి : 1 చెంచా
  • పాలు : 6 చెంచాలు
  • గ్రీన్ ఫుడ్ కలర్ ఒక పించ్
  • డ్రైఫ్రూట్స్:::
  • జీడిపప్పు 8 (ముక్కలుగా చేస్కోండి)
  • కిస్మిస్ 8
  • పిస్తా 6(ముక్కలుగా చేస్కోండి)

సొరకాయ హల్వా | How to make BOTTLEGOURD HALWA Recipe in Telugu

  1. తురిమిన సొరకాయ ని బాండీలో తీసుకొని చిన్న మంటపై పోయి మీద పెట్టండి
  2. దాన్లో నీరు మొత్తం ఇంకి పోయేంతవరకు వరకు వేయించండి
  3. ఇప్పుడు దాంట్లో పంచదార వేసి కలపండి పంచదార కరిగిపోయే దాకా చక్కగా కలుపుక్కోండి
  4. యాలుకలు దంచి దాంట్లో వెయ్యండి
  5. ఇప్పుడు మంటని పెద్దదిగా చేసుకోండి పాలను పోయండి పాలు ఇంకిపోయే దాకా కలపండి తరువాత మంటని తగ్గించుకోండి
  6. ఒక పించ్ గ్రీన్ ఫుడ్ కలర్ వేయండి.కలపండి.
  7. పక్కన పోయి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక చెంచా నూనె వేసుకొని డ్రైఫ్రూట్స్ను వేయించుకోండి. వాటిని తీసి ఒక ప్లేట్ లో తీసుకోండి
  8. వేయించిన డ్రైఫ్రూట్స్ని, నెయ్యిని హల్వా లో వేసి కలపండి.ఒక నిమిషం తరువాత పోయి కటేయండి.
  9. అంతే సొరకాయ హల్వా తయారు.

నా చిట్కా:

వొద్దు అనుకుంటే ఫుడ్ కలర్ వేయనకరలేదు

Reviews for BOTTLEGOURD HALWA Recipe in Telugu (0)