తీపి మిఠాయి కొమ్ములు | sweet kommulu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  13th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • sweet kommulu recipe in Telugu,తీపి మిఠాయి కొమ్ములు, Indira Bhaskar
తీపి మిఠాయి కొమ్ములుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

తీపి మిఠాయి కొమ్ములు వంటకం

తీపి మిఠాయి కొమ్ములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make sweet kommulu Recipe in Telugu )

  • శెనగపిండి ఒక కప్పు
  • బియ్యం పిండి రెండు చెంచాలు
  • బెల్లం ఒక కప్పు
  • ఇలాచి పౌడర్ పావు స్పూను
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

తీపి మిఠాయి కొమ్ములు | How to make sweet kommulu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి బియ్యం పిండి ,నెయ్యి వేసి మధ్యలో కొద్దిగా నీరు వేస్తూ చపాతీ పిండిలా చెయ్యాలి.
  2. ఇప్పుడు వీటిని పొడుగ్గా కొమ్ముల్లా చే తితో వత్తుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి వేడెక్కాక పైన చేసుకున్న కొమ్మల్ని వేసి ఎర్రగా చిన్నమంటమీద వేయించాలి.
  4. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం వేసి నీళ్లు వేసి కొద్దిగా తీగపాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి.
  5. ఈ ఇలాచి పౌడర్ కూడా పాకంలో వేసి కలపాలి.
  6. ఇప్పుడు పైన చేసుకున్న కొమ్ముల్ని ఈ పాకంలో వేసి బాగా కలిపి పాకం పట్టేలా ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసుకుంటే మిఠాయి కొమ్ములు రెడీ.

నా చిట్కా:

శనగపిండి పడనివారు దీనిని గోధుమపిండితో కూడా చేసుకోవచ్చు.

Reviews for sweet kommulu Recipe in Telugu (0)