డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. | Dry frits laddu. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dry frits laddu. recipe in Telugu,డ్రై ఫ్రూట్స్ లడ్డూలు., Swapna Tirumamidi
డ్రై ఫ్రూట్స్ లడ్డూలు.by Swapna Tirumamidi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. వంటకం

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dry frits laddu. Recipe in Telugu )

  • ఎండు ఖజ్జురాలు 3 కప్పులు
  • బాదం పప్పు 2 కప్పులు
  • పిస్తాపప్పు 2 కప్పులు
  • వాల్నట్స్..1 కప్పు
  • యాలకుల పొడి అర చెంచా.
  • పాత బెల్లం పొడి 1 కప్పు..
  • నెయ్యి అరకప్పు

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. | How to make Dry frits laddu. Recipe in Telugu

  1. ముందుగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పెట్టుకోవాలి...8 నుంచి 10 నిముషాలు వేయించాలి....మాడిపోనివ్వకూడదు...కొద్దిగా మాడినా రుచి మారిపోతుంది.
  2. ఎండు ఖజ్జురాలు గింజలు తీసి పెట్టుకోవాలి.
  3. పాతబెల్లం పొడి చేసి పెట్టుకోవాలి...
  4. ఇప్పుడు మిక్సీలో ఒక్కొక్క రకం పప్పులను పొడి చేసుకోవాలి .బాగా మెత్తగా ఉండకూడదు...కొంచం మొరుమ్ లా ఉండాలి .
  5. ఇప్పుడు ఎండు ఖజ్జూరాలు కూడా మెత్తగా పొడి చేసి అందులో బెల్లంపొడి వేసి ఒకసారి మిక్సీ పట్టాలి... ఇలా చేయడం వల్ల బెల్లం బాగా కలుస్తుంది.
  6. ఇప్పుడు అన్ని పొడులు ఒక బౌల్ లోకి వేసి చేతితోనే బాగా నలిపి నలిపి కలపాలి... పప్పుల పొడికి తీపి అంతా పట్టేలా కలపాలి.
  7. ఇప్పుడు యాలకుల పొడికూడా వేసి కలపాలి...
  8. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని కొద్ది కొద్దిగా పప్పుల పొడి లో వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి...అంతే ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూలు సిద్ధం.

నా చిట్కా:

నెయ్యి ఎక్కువ వెయ్యకూడదు...లడ్డు నిలబడేంతవరకె వేసుకోవాలి.తీపి మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు.

Reviews for Dry frits laddu. Recipe in Telugu (0)