బొంబాయి/కరాచీ హల్వా | Bombay/karachi Halwa Recipe in Telugu

ద్వారా Dhana laxmi malayala  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bombay/karachi Halwa recipe in Telugu,బొంబాయి/కరాచీ హల్వా, Dhana laxmi malayala
బొంబాయి/కరాచీ హల్వాby Dhana laxmi malayala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

బొంబాయి/కరాచీ హల్వా వంటకం

బొంబాయి/కరాచీ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bombay/karachi Halwa Recipe in Telugu )

  • 1/2 కప్పు : కార్న్ ఫ్లవర్
  • 1 1/2 కప్పుల : నీళ్లు
  • 1 1/2 కప్పుల : చెక్కర
  • 1 కప్పు : నీళ్లు (పాకానికి)
  • 1/2 చెంచా : యాలుకల పొడి
  • చిటికెడు : కేసరి రంగు
  • 2 పెద్ద చెంచాల : నెయ్యి

బొంబాయి/కరాచీ హల్వా | How to make Bombay/karachi Halwa Recipe in Telugu

  1. ముందుగా ఒక పళ్ళానికి నెయ్యి రాసి పెట్టుకోండి.
  2. ఒక గిన్నెలో కోర్న్ ఫ్లవర్, కేసరి రంగు, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి.
  3. ఒక కడాయి లో ఒక కప్పు నీళ్లు మరియు ఒకటిన్నర కప్పుల చెక్కర వేసుకొని బాగా మరిగించండి.
  4. తీగ పాకం రానవసరం లేదు.
  5. మారుగుతున్న చెక్కర నీటిలో కలుపుకున్న కోర్న్ ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ ఉడికించండి.
  6. రెండు మూడు నిమిషాల తరువాత మిశ్రమం దెగ్గర పడుతుంది.
  7. ఇప్పుడు ఇష్టం ఉంటే తరిగిన పలుకులు వేసుకోండి. నేను వేయలేదు.
  8. దెగ్గర పడిన తరువాత యాలుకల పొడి, నెయ్యి వేసుకొని కలుపుకోండి.
  9. కాసేపటికి మిశ్రమం కడాయి ని వదిలిపెట్టి ముద్దలా మారుతుంది.
  10. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న పళ్లెం లోకి తీసుకొని సామంతరంగా పరుచుకొని చల్లార నివ్వండి.
  11. ఆ పైన మీకు ఇష్టాను సారంగా ముక్కలు కోసుకుని సర్వ్ చేసుకోండి.

Reviews for Bombay/karachi Halwa Recipe in Telugu (0)