రోజ్ అంగూర్ | Rose angoore Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rose angoore recipe in Telugu,రోజ్ అంగూర్, Indira Bhaskar
రోజ్ అంగూర్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

రోజ్ అంగూర్ వంటకం

రోజ్ అంగూర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rose angoore Recipe in Telugu )

  • పాలు అర లీటరు లేదా పన్నీర్ 100 గ్రాములు
  • మైదా ఒక చెంచాడు
  • ఇలాచి పౌడర్ పావు స్పూను
  • పంచదార ఒక కప్పు
  • రోజ్ కలర్ సిరప్ లేదా ఫుడ్ కలర్ పావు స్పూను

రోజ్ అంగూర్ | How to make Rose angoore Recipe in Telugu

  1. ముందుగా పాలను విరగ్గొట్టి పనీర్ లా చేసుకోవాలి.
  2. ఇక్కడ పన్నీర్ని వాడి‌ ఈ స్వీట్ ని చేశాను.
  3. ముందుగా పన్నీర్ని, మైదాపిండిని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా చేయాలి.
  4. అప్పుడు దీన్ని చేతితో మెత్తగా మృదువుగా కలపాలి.
  5. ఇప్పుడు దీంట్లో కొద్ది భాగం తీసుకుని రోజ్ కలర్ syrup లేదా రోజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
  6. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా చేసి పొడుగ్గా అంగూర్ ఆకారంలో చేసుకుని పక్కన పెట్టాలి.
  7. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల పాటు పాకం వచ్చేలా మరిగించాలి.
  8. దీంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసి కలపాలి.
  9. అక్కని తీగపాకం రానక్కరలేదు మామూలు పాకం వస్తే సరిపోతుంది.
  10. ఇప్పుడు పాన్ చేసుకున్న అంగూర్ లను ఈ పాకంలో వేసి ఒక అరగంట ఉంచి తీసి సర్వ్ చేసుకుంటే తియ్యతియ్యని అంగూర్ రెడీ.

నా చిట్కా:

మనం చేసుకున్న పిండి మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే అంగూరు లు పాకం పీల్చుకోకుండా గట్టిగా ఉండిపోతాయి.

Reviews for Rose angoore Recipe in Telugu (0)